T20 WC 2022: సఫారీలకు షాకిచ్చిన నెదర్లాండ్స్.. అనూహ్యంగా రేసులోకి వచ్చిన పాక్

T20 WC 2022: ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్ లో ఆదివారం అనూహ్య ఫలితాలు వెలువడ్డాయి.  అగ్రశ్రేణి జట్టుగా ఉన్న సౌతాఫ్రికా సెమీస్ చేరడం ఖాయమనుకుంటే తాజాగా  ఆ జట్టుకు  పసికూన నెదర్లాండ్స్ ఊహించని షాకిచ్చింది. ఆదివారం అడిలైడ్ వేదికగా ముగిసిన మ్యాచ్‌లో సౌతాఫ్రికాపై  నెదర్లాండ్స్ 13 పరుగుల తేడాతో  ఓడించింది. దీంతో దక్షిణాఫ్రికా జట్టు సెమీస్  రేసుతో పాటు టోర్నీ నుంచి కూడా నిష్క్రమించింది.

ఆదివారం అడిలైడ్ ఓవల్‌లో ముగిసిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి  158 పరుగులు చేసింది.  సఫారీ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. పెద్దగా పరుగులు చేయనప్పటికీ నెదర్లాండ్స్ వికెట్లు కోల్పోలేదు. ఆఖర్లో ఆ జట్టు బ్యాటర్ అకెర్మన్ (26 బంతుల్లో 41 నాటౌట్) రాణించడంతో డచ్ జట్టు ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది.

మోస్తారు లక్ష్య ఛేదనలో సఫారీ బ్యాటింగ్ లైనప్ తడబడింది. ఆ జట్టు స్టార్ బ్యాటర్లంతా  అలా వచ్చి ఇలా వెళ్లారు.  ఓపెనర్ క్వింటన్ డికాక్ (13), టెంబ బవుమా (20), రిలీ రొసో (25), మార్క్రమ్ (17) తో పాటు ఫినిషర్ గా గుర్తింపు పొందిన డేవిడ్ మిల్లర్ (17), హెన్రిచ్ క్లాసెన్ (21) కూడా విఫలమయ్యారు. దీంతో సౌతాఫ్రికా.. 20 ఓవర్లలో 145 పరుగులు మాత్రమే చేయగలిగింది. అయితే ఆ జట్టు సెమీస్ ఆశలు బంగ్లా-పాక్ మ్యాచ్ మీద ఆధారపడ్డాయి. వర్షం వల్ల ఈ మ్యాచ ఆగిపోతే సఫారీలకు లాభించేది. కానీ అలా జరుగలేదు.

పాక్ సెమీస్‌కు..  బంగ్లా ఇంటికి..

అనుకోకుండా  వచ్చిన అవకాశాన్ని పాకిస్తాన్ ఒడిసిపట్టుకుంది. సౌతాఫ్రికా ఓడటంతో.. బంగ్లాదేశ్-పాకిస్తాన్ మ్యాచ్ లో విజేత సెమీస్ చేరే అవకాశం వచ్చింది. దీంతో ఈ మ్యాచ్ లో  బౌలింగ్ తో పాటు బ్యాటింగ్ లో రాణించిన పాకిస్తాన్.. బంగ్లాదేశ్‌ను 5 వికెట్ల తేడాతో ఓడించింది.  ఈ మ్యాచ్ లో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్.. 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది. స్వల్ప లక్ష్యాన్ని పాకిస్తాన్.. 18.1 ఓవర్లలోనే ఛేదించి  సెమీస్ కు చేరింది. గ్రూప్-2లో భారత్ ఇదివరకే సెమీస్ కు చేరిన విషయం తెలిసిందే.  పాకిస్తాన్ సెమీస్ చేరడంతో బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికాలు టోర్నీ నుంచి నిష్క్రమించాయి.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -