Harish Shankar: హరీష్ శంకర్ పరువు తీసిన నెటిజన్.. ఆయన రియాక్షన్ ఇదే!

Harish Shankar: టాలీవుడ్ దర్శకుడు హరీష్ శంకర్ గురించి మనందరికీ తెలిసిందే. హరీష్ శంకర్ తెలుగులో ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రవితేజ లాంటి స్టార్ హీరోలకు సూపర్ హిట్ సినిమాలను అందించిన సంగతి మన అందరికీ తెలిసిందే. తెలుగులో మిరపకాయ్, గబ్బర్ సింగ్, రామయ్య వస్తావయ్యా, దువ్వాడ జగన్నాథం, గదలకుండా గణేష్ లాంటి సినిమాలకు దర్శకత్వం వహించి డైరెక్టర్ గా మంచి గుర్తింపు ఏర్పరచుకున్నారు హరీష్ శంకర్.

ఇకపోతే హరీష్ శంకర్ ప్రస్తుతం టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న భగత్ సింగ్ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఇది తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన తెరి సినిమాకు రీమేక్ గా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇది ఇలా ఉంటే తాజాగా ఒక నెటిజన్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సదరు నెటిజన్ హరీష్ శంకర్ ని ఉద్దేశించి ట్వీట్ చేయడంతో హరీష్ శంకర్ తనదైన శైలిలో స్పందించారు. ఎన్నో హిట్స్‌ ఇచ్చిన మీరు మూడేళ్ల తర్వాత తీసే సినిమాకు రీమేక్‌ సెలెక్ట్‌ చేసుకోవడం ఏంటి అని ప్రశ్నించాడు.

 

ఆ ట్వీట్ పై స్పందించిన హరీష్ శంకట్ తన ఫిల్మోగ్రఫీని, ఉస్తాద్‌ భగత్‌సింగ్‌ను ఉద్దేశించి ఉన్న ఆ ట్వీట్‌కు వివరణ ఇవ్వడానికి ఇది వేదిక కాదని హరీశ్‌ సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రస్తుతం ఆయన ట్వీట్‌ చర్చకు దారి తీసింది. కొందరు నెటిజన్లు హరీశ్‌ శంకర్‌ ట్వీట్‌కు మద్దతు తెలుపుతుండగా మరికొంతమంది మాత్రం.. సర్‌.. ఇది నిజంగా రీమేకేనా అని అడుగుతున్నారు. మరి నెటిజన్స్ అడిగే ప్రశ్నలకు హరీష్ శంకర్ ఏ విధంగా సమాధానం చెబుతారో చూడాలి మరి.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: సీఎం జగన్ ఆ విషయంలో భయపడుతున్నారా.. అలా జరుగుతోందా?

CM Jagan: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆలోచన విధానం, ఆయన మాటలు వైసిపి మంత్రులకు ఎమ్మెల్యేలకు అంతు చిక్కడం లేదు. జగన్ ఆలోచన విధానాలను అంచనా వేయలేకపోతున్నారు. ఇకపోతే గత...
- Advertisement -
- Advertisement -