తాను సంపాదించిన డబ్బులు లెక్కిస్తున్న వీడియోకు నెటిజన్లు ఫిదా!

సోషల్‌ మీడియా వచ్చినప్పటి నుంచి ప్రపంచంలో ఏ మూలన ఏం జరిగినా క్షణాల్లో అందరికీ తెలిసిపోతుంది. ఎక్కడైనా ఎలాంటి మంచి పనులు చేసినప్పుడు గానీ.. ఎవరినైనా ఇతరులు వేధిస్తున్నా గాని.. వాటని వీడియో తీసి సోషల్‌ మీడియాల్లో పోస్టు చేస్తున్నారు. కొన్ని సార్లు అలాంటి వీడియోలు చూసిన జనాలు స్పందిస్తున్నారు కూడా. ఎవరికి ఎదీ మంచిగా కనబడినా వాటిని వీడియో రూపంలో అందరికీ షేర్‌ చేస్తుంటారు. మనిషి తనకున్న వాటిని మరచి లేని వాటి కోసం వెంపర్లాడుతూ ఒత్తిడితో చిత్తవుతున్నాడు. తనకున్న దాంతో తృప్తి చెందే వారు నిజమైన సంపన్నులని పెద్దలు చెబుతుంటారు. బతుకు పోరాటంలో ఎందరో ఎన్నో కష్టనష్టాలకు కోర్చి ఎదురీదుతున్నారు.

‘జిందేగీ గుల్జార్‌ హై’ పేజ్‌ ట్విటర్‌లో షేర్‌ చేసిన వీడియోను చూస్తే సంపాదన విలువ అంటే ఏంటో తెలిసిపోతుంది. ఇటీవల అదే పేజీ ముంబయి లోకల్‌ రైల్లో ఓ వృద్ధురాలు బతుకు పోరాటం కోసం బిస్కెట్లు, బఠాణిలు, చిప్స్‌ ప్యాకెట్లు అమ్ముతున్న వీడియోను షేర్‌ చేయగా ఆ వీడియో చూసిన కొందరు నెటిజన్లు ఆమెకు సహాయం చేసేందుకు ముందుకొచ్చారు. తాజాగా ఓ పెద్దాయన రోజంతా తాను సంపాదించిన మొత్తాన్ని లెక్కిస్తున్న వీడియో ఆన్‌లైన్‌లో వైరల్‌ కావడంతో ఎంతో మంది హృదయాలను కలిచివేసింది. ఈ వైరల్‌ వీడియోను జిందగి గుల్జార్‌ హై అనే పేజ్‌ ట్విట్టర్‌లో షేర్‌ చేసింది. ఈ షార్ట్‌ క్లిప్‌లో ఆ రోజంతా తాను సంపాదించిన మొత్తాన్ని లెకించడం కనిపిస్తుంది.

ఈ వీడియో సోషల్‌ మీడియాలో పోస్టు అయిన కొంత సేపటికే 3 లక్షల వ్యూస్‌కు చేరువైంది. ఈ వీడియోను చూసిన తర్వాత నెటిజన్లు భావోద్వేగానికి లోనయ్యారు. నీకున్నదాంతో సంతోషంగా ఉండూ.. నీ చిన్న గది, చిరు ఆదాయం, స్మార్ట్‌ గాడ్జెట్ల వంటివి కూడా లగ్జరీనే. వాటి పట్ల కృతజ్ఞత చూపించు.. దయతో వ్యవహరించు అని ఓ యూజర్‌ రాసుకొచ్చాడు. ఈ వీడియో హృదయాన్ని తాకిందని.. ఇలా ఎవరి మనస్సులోని మాటలను వారు కామెంట్ల రూపంలో రాసుకొచ్చారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu: వారికి 500 యూనిట్ల వ‌ర‌కు విద్యుత్‌.. చంద్రబాబు హామీతో ఆ వర్గం ఓట్లు టీడీపీకే వస్తాయా?

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు అన్ని వర్గాల ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని వరాల జల్లు కురిపిస్తున్నారు. నిరుద్యోగులు, రైతులు, మహిళలు, చేనేత కార్మికులు ఇలా.. ఒక్కొక్కరికి ఏం కావాలి? వాళ్లకి ఎలాంటి...
- Advertisement -
- Advertisement -