God Father: గాడ్ ఫాదర్ పోస్టర్లో సునీల్ గురించి దర్శకుడిని ఏకీపారేస్తున్న నెటిజెన్స్!

God Father: టాలీవుడ్ ప్రేక్షకులకు మెగాస్టార్ చిరంజీవి గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్ లో 150 సినిమాలుకు పైగా నటించి ఇండస్ట్రీలో నటుడిగా తనకంటూ చెరగని ముద్ర సంపాదించుకున్నాడు. ప్రస్తుతం కుర్ర హీరోలతో సమానంగా మెగాస్టార్ సినిమా అవకాశాలు అందుకుంటూ తెలుగు ఇండస్ట్రీలో అగ్రస్టార్ హీరోగా ఓ వెలుగు వెలుగుతున్నాడు.

ఇదిలా ఉంటే ఇటీవల విడుదలైన మెగాస్టార్ ఆచార్య సినిమా భారీ స్థాయిలో డిజాస్టర్ గా నిలిచింది. ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా చిరంజీవి ఫ్యాన్స్ ను పూర్తిగా నిరాశపరిచింది. మెగా ఫ్యాన్స్ ఆశలన్నీ చిరంజీవి తదుపరి సినిమా గాడ్ ఫాదర్ సినిమాపై పెట్టుకున్నారు. కాగా సినిమా షూటింగ్ వీలైనంత త్వరగా పూర్తి చేస్తున్నారు. ఈ సినిమాకు మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నాడు.

ఈ సినిమాను మలయాళం రీమేక్ లూసిఫర్ చిత్రాన్ని తెలుగులో గాడ్ ఫాదర్ గా రీమేక్ చేస్తున్నారు. అయితే మొదట ఈ సినిమాలో హీరోయిన్ ని తీసుకోవాలనుకున్నారు. కానీ మలయాళం లో లూసిఫర్ లో హీరోయిన్ లేనందున గాడ్ ఫాదర్ సినిమాలో హీరోయిన్ ను తీసుకోవడానికి ఆసక్తి చూపలేదు. ఇక ఈ సినిమాలో సునీల్ కూడా ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా నుంచి ఒక పోస్టర్ ను విడుదల చేశారు.

కాగా ప్రస్తుతం ఈ పోస్టర్ ను నెటిజన్లు ఒక రేంజ్ లో ట్రోల్స్ చేసారు. దీనికి కారణం ఈ సినిమా దర్శకుడు ఈ పోస్టర్ విడుదల క్రమంలో ఒక పెద్ద మిస్టేక్ చేశారు. పోస్టల్ లో చిరంజీవి పక్కన సునీల్ తో పాటు కొంతమంది జండాలు పట్టుకొని ముందుకు నడుస్తూ కనిపించారు. అయితే సునీల్ చిరంజీవికి రైట్ సైడ్ కనిపిస్తాడు. అంతేకాకుండా జనాల్లో లెఫ్ట్ సైడ్ కూడా సునీల్ కనిపిస్తాడు. దాంతో నెటిజన్లు ఇంత పెద్ద మిస్టేక్ ఎలా చేశారు డైరెక్టర్ సార్. చూసుకోవద్ద అని ఆ పోస్టర్ పై ట్రోల్ల్స్ చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Janasena: జనసైనికులను రెచ్చగొట్టే విధంగా వైసీపీ వ్యూహాలు.. ఈ వ్యూహాల వల్ల ఫలితం ఉంటుందా?

Janasena: ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధమవుతుందని తెలుస్తుంది. ఈ క్రమంలోనే అన్ని పార్టీ నేతలు కూడా అభ్యర్థులను ప్రకటించే ప్రక్రియ పూర్తి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తెలుగుదేశం జనసేన కూటమి...
- Advertisement -
- Advertisement -