Adipurush Vs Sri Rama Rajyam: ఆదిపురుష్ వర్సెస్ శ్రీరామరాజ్యం.. రెండు సినిమాలలో ఆ సినిమా బెస్ట్ అంటూ?

Adipurush Vs Sri Rama Rajyam: గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో ప్రభాస్ ఆది పురుష్ సినిమా టీజర్ గురించి అనేక రకాల చర్చలు జరుగుతున్నాయి. ఈ టీజర్ పూర్తిగా కార్టూన్ సినిమాలా ఉందని కొందరు అంటున్నారు. మరికొందరు 500 కోట్లు ఖర్చుపెట్టి పాన్ ఇండియా స్టార్ తో కార్టూన్ సినిమా చేశారని దెప్పి పొడుస్తున్నారు. ఏదేమైనా టీజర్ విడుదలయితే ఆ టీజర్ సినిమా మీద అంచనాలు పెంచాలి.

కానీ ఆది పురుష్ టీజర్ మాత్రం ప్రభాస్ అభిమానులను నిరాశపరిచిందనే చెప్పవచ్చు. ఈ విషయంలో కోలీవుడ్ ప్రేక్షకులు పొన్నియన్ సెల్వన్ సినిమాను దెప్పి పొడిచిన నేపథ్యంలో ఇప్పుడు ప్రభాస్ అభిమానులను మరో స్థాయిలో ఏకిపారేస్తున్నారు. ఇక కొందరు ఆది పురుష్ సినిమాను పూర్తిగా యానిమేషన్ గ్రాఫిక్స్ లో తీశారని, ఈ సినిమా కార్టూన్ సినిమాలా అనిపిస్తుందని చాలామంది ట్రోల్ చేస్తున్నారు. అయితే మొత్తానికి ఆది పురుష్ సినిమా కూడా ఫెయిలవుతుందని చాలామంది భావిస్తున్నారు.

ఇదిలా ఉంటే దాదాపు పది సంవత్సరాల క్రితం శ్రీరామరాజ్యం సినిమా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా అప్పటి ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. కానీ ఓల్డ్ జనరేషన్ పీపుల్ కు ఈ సినిమా నచ్చింది. ఈ సినిమా గురించి ఇప్పుడు చర్చ ఎందుకు వచ్చిందంటే.. ఆది పురుష్ కంటే ఈ సినిమానే బెటర్ అని అంటున్నారు ఇప్పుడు. ఆది పురుష్ సినిమా యూత్ కి చిన్నపిల్లలకు నచ్చే విధంగా ఉందని.. టీజర్ కు నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ ఈ సినిమా హిట్ అవుతుందని ప్రభాస్ అభిమానులు అనుకుంటున్నారు.

కానీ కొంతమందికి శ్రీరామరాజ్యం సినిమా బెస్ట్ మూవీ అనిపిస్తే మరి కొంతమందికి ఆది పురుష్ సినిమా బెస్ట్ మూవీ అనిపిస్తుంది. ఏదేమైనా ప్రభాష్ అభిమానులు ఆదివారం రోజున విడుదలైన టీజర్ తో బాగా నిరాశ చెందుతున్నారు. ఈ టీజర్ చూసిన యాంటీ అభిమానులు మాత్రం ఒక రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. మరి త్వరలో విడుదల కాబోయే ఈ సినిమా ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి. ఇక టీజర్ విషయంలో ప్రభాస్ కూడా నిరాశ చెందినట్లు తెలుస్తుంది.

Related Articles

ట్రేండింగ్

Raghurama Krishnamraju: రఘురామ కృష్ణంరాజు కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తారా.. ఏ దిక్కు లేకపోతే అ పార్టీనే దిక్కవుతుందా?

Raghurama Krishnamraju: ఏపీలో రఘురామకృష్ణం రాజు ఏపీలో ప్రస్తుతం హాట్ టాపిక్ గా ఉన్నారు. నిజానికి గత నాలుగేళ్లు ఏపీ రాజకీయాల్లో ఆయన ట్రెండ్ అవుతూనే ఉన్నారు. వైసీపీ ఎంపీల పేర్లు గుర్తు...
- Advertisement -
- Advertisement -