Ram Charan: చరణ్ తీరుపై నెటిజన్ల సెటైర్లు.. బుద్ధి మార్చుకోవాలంటూ?

Ram Charan: టాలివుడ్ ఇండస్ట్రీలో మెగా కుటుంబానికి ఉన్న పేరు ప్రఖ్యాతలు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీలో నంబర్ వన్ హీరోగా ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్నాడు. ఇక చిరంజీవి తనయుడు రామ్ చరణ్ కూడా ఇండస్ట్రీలో హీరోగా అడుగుపెట్టి మంచి గుర్తింపు పొందాడు.ఇక ఇటీవల రాజమౌళి దర్శకత్వం వహించిన త్రిబుల్ ఆర్ సినిమాలో నటించి పాన్ ఇండియా రేంజ్ లో మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు.

 

ఇక ఈ సినిమాలోని నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబల్ అవార్డు లభించడమే కాకుండా సినిమా ఇండస్ట్రీలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డు కూడా వరించింది. దీంతో ఈ సినిమాలో నటించిన రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ అమాంతం పెరిగిపోయి గ్లోబల్ స్టార్స్ గా గుర్తింపు పొందారు. ఈ క్రమంలో రామ్ చరణ్ తన దూకుడు బాగా పెంచేశాడు. ఇటీవల తరచూ విదేశాలకు వెళుతున్న రామ్ చరణ్ విదేశాలలో ఇంటర్వ్యూలలో పాల్గొంటూ పబ్లిసిటీ పెంచుకుంటున్నారు.

తాజగా ముంబాయిలో ఒకటికి రెండు ఏజెన్సీలను అపాయింట్ చేసి మరీ స్టోరీలు, ఫొటోలు ఒకదాని వెంట మరోటి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నాడు. ఇలా ఉదయం లేస్తే వార్త..ఫొటో…మళ్లీ మధ్యాహ్నం.. సాయంత్రం ఇలా పబ్లిసిటీ పెంచుకునే పనిలో బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలో తాజాగా ఓ ఫోటో షేర్ చేశాడు. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఫొటోలో రామ్ చరణ్ స్టయిల్ గా టేబుల్ మీద‌ కూర్చుని ఉండగా… పక్కనే టేబుల్ మీద నాటు నాటు పాటకి వచ్చిన గోల్డెన్ గ్లోబ్, ఆస్కార్ అవార్డులు వున్నాయి.

 

ఇక కింద నేల మీద చరణ్ కాళ్ల దగ్గర ఓ పక్కన ఫిల్మ్ ఫేర్ అవార్డులు, మరోపక్కన గౌరవ మైన నందీ అవార్డులు పెట్టారు. అయితే ఆస్కార్ అవార్డులు తన పక్కన పెట్టుకొని మన దేశంలో ఇచ్చిన నంది అవార్డును కాళ్ళ దగ్గర పెట్టి ఆ అవార్డుపట్ల తన చిన్న చూపు బయట పెట్టాడు.అంతే కాదు మన మీడియాలో వచ్చిన వార్తల క్లిప్పింగ్ లు కూడా కాళ్ల దగ్గర పడేసారు. అంతే కాకుండా చిరంజీవి పూజించే అంజ‌నీ పుత్రుడి బొమ్మ వున్న కొణిదేల బ్యానర్ సింబల్ వున్న ప్రింట్ లు కూడా కాళ్ల దగ్గర నేలపైనే వుంచారు. దీంతో రామ్ చరణ్ తీరుపై నెటిజెన్లు ఫైర్ అవుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: మేకబోతు గాంభీర్యంతో జగన్ ఎన్నికల పోరు.. సర్వేలను కొంటే సరిపోతుందా?

CM Jagan: త్వరలోనే ఏపీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేశారు. ఇక నామినేషన్ ప్రక్రియ కూడా మొదలు కావడంతో ఇప్పటికే పలువురు నేతలు నామినేషన్ కూడా దాఖలు చేశారు....
- Advertisement -
- Advertisement -