Manchu Vishnu: మరోసారి భారీ ట్రోలింగ్ కి గురైన మంచు విష్ణు.. అసలేమైందంటే?

Manchu Vishnu: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచు కుటుంబం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఈ కుటుంబం సినిమాల కన్నా నిత్యం ట్రోలింగ్ ద్వారా పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తుంటారు.మంచి కుటుంబ సభ్యులకు ఎవరైనా సోషల్ మీడియా వేదికగా ఎలాంటి పోస్ట్ చేసిన క్షణాల్లో వైరల్ అవ్వడమే కాకుండా పెద్ద ఎత్తున నేటిజన్ల నుంచి ట్రోలింగ్ ఎదుర్కొంటారు.ఇకపోతే ఈ విషయంపై మంచు విష్ణు కథలో ఎన్నోసార్లు సీరియస్ అయిన విషయం తెలిసిందే.

ఇండస్ట్రీకి చెందిన ఓ ప్రముఖ హీరో ఉద్దేశపూర్వకంగానే తమ కుటుంబం పై ఇలా బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని మా కుటుంబ పరువు ప్రతిష్టలు తీస్తున్నారంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అయితే మా ఎన్నికల సమయం నుంచి మంచి కుటుంబం పై ఈ విధమైనటువంటి విమర్శలు ఎక్కువయ్యాయి. ఇలా ఆ హీరో గురించి బహిరంగంగా చెప్పినప్పటికీ ఆయన పేరు మాత్రం బయట పెట్టలేదు.

ఈ క్రమంలోనే మంచు విష్ణు నటిస్తున్నటువంటి జిన్నా మూవీ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా మంచు విష్ణు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా యాంకర్ ప్రశ్నిస్తూ మీ పై ఇండస్ట్రీలో ఒక హీరో బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు ఆ హీరో ఎవరు ఆయన పేరు చెప్పండి అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు మంచు విష్ణు పెదవి విరుస్తూ ఆయన ఎవరో మీకు తెలియదా అంటూ ఎదురు ప్రశ్న వేశారు.

నేను ఆయన పేరు బయటకు పెట్టి ఇండస్ట్రీ పరువు తీయాలనుకోలేదు ఆయన ఓ పెద్ద మేధావి అంటూ ఆ హీరో పేరు చెప్పకుండా ఈ ప్రశ్న దాటివేశారు. అయితే మంచు విష్ణు ఈ విధంగా ఆ హీరో పేరు చెప్పకపోవడంతో మరోసారి ట్రోలర్స్ కు మంచి అవకాశం రావడంతో మా ప్రెసిడెంట్ కు ఆ హీరో పేరు చెప్పే ధైర్యం కూడా లేదా దమ్ముంటే ఆ హీరో బయట పెట్టండి అంటూ పెద్ద ఎత్తున మంచు విష్ణు వ్యాఖ్యలపై ట్రోలర్స్ తమదైన శైలిలో ట్రోలింగ్ చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -