Megastar Chiranjeevi: మహేష్ బాబుకు ఉన్న పరిణతి చిరంజీవికి లేదా.. ట్రోల్స్ అవసరమా అంటూ?

Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి సాధారణంగా కొన్ని వివాదాలకు దూరంగా ఉంటారు. అయితే ఈ మధ్యకాలంలో ఈయన చేస్తున్న వ్యాఖ్యల కారణంగా భారీగా ట్రోల్ అవుతున్నారు. చిరంజీవి తాజాగా నటించిన చిత్రం గాడ్ ఫాదర్ ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఈయన తన డిజాస్టర్ సినిమా ఆచార్య గురించి పలుమార్లు ప్రస్తావన తీసుకొచ్చారు.గాడ్ ఫాదర్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా చిరంజీవి ఆచార్య సినిమా గురించి మాట్లాడుతూ ఈ సినిమా విషయంలో తమ ప్రమేయం ఏమాత్రం లేదని అంతా దర్శకుడు చెప్పినట్టే చేశామని తెలిపారు.

ఈ విధంగా చిరంజీవి ఒక్కసారి ఈ సినిమా గురించి స్టేట్మెంట్ ఇవ్వడంతో నేటిజెన్లు ఈ విషయాన్ని పలుమార్లు షేర్ చేస్తూ చిరంజీవిని భారీ ట్రోలింగ్ కి గురి చేస్తున్నారు.ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబుతో పోలుస్తూ ఆయనకున్నంత పరిణితి కూడా చిరంజీవికి లేదా అంటూ కామెంట్ లు చేస్తున్నారు. ఇక చిరంజీవి ఈ విషయంపై మాట్లాడుతూ సినిమా ఫ్లాప్ కావడానికి పూర్తి బాధ్యత కొరటాలదే తమ ప్రమేయం లేదని తెలియజేశారు. అయితే ఈ సినిమా ప్రతి ఒక్క విషయంలో మెగాస్టార్ చొరవ ఉందంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి.

ఇక ఈ సినిమా ఫ్లాప్ కావడంతో ప్లాప్ మొత్తం కొరటాలపై వేశారు. అయితే కొరటాల శివ ఈ సినిమా అపజయం గురించి నోరు విప్పలేని పరిస్థితి ఈయన పరిస్థితి కాదు స్టార్ హీరోల సినిమాలకు దర్శకత్వం వహించే ఏ దర్శకుడికైనా ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది.గతంలో మెగాస్టార్ నటించిన స్టాలిన్ సినిమా విషయంలో కూడా డైరెక్టర్ మురగదాస్ కి ఇదే పరిస్థితి ఎదురైంది. దీంతో మెగాస్టార్ చేసిన ఈ వ్యాఖ్యలపై పలువురు చిరంజీవిని భారీగా ట్రోల్ చేస్తున్నారా.

ఇక ఈ విషయంపై స్పందించిన పలువురు నెటిజన్ లు మహేష్ బాబుకి ఉన్నంత పరిణితి కూడా మెగాస్టార్ చిరంజీవికి లేదా.. గతంలో ఓ ఇంటర్వ్యూలో భాగంగా మహేష్ బాబు మాట్లాడుతూ ఒక సినిమా ఫ్లాప్ అయ్యిందంటే ఆ పూర్తి బాధ్యత నాదేనని ఈయన తెలిపారు.ఎందుకంటే ఆ సినిమాని ఎంచుకున్నది తానే కనుక ఆ సినిమా ఫ్లాప్ అయిన హిట్ అయిన ఆ బాధ్యత పూర్తిగా నాదేనంటూ మహేష్ కామెంట్ చేశారు.ఇక ఈ విషయాన్ని గుర్తు చేసుకుంటూ నేటిజన్స్ మెగాస్టార్ పై ట్రోలింగ్ మొదలు పెట్టారు.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -