Next AP CM: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఏపీకి ముఖ్యమంత్రి కాబోతున్నారా?

Next AP CM: యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ పరంగా దూసుకెళ్తున్నారు. టాలీవుడ్‌లో నంబర్ వన్ పొజిషన్‌లో కొనసాగుతున్నారు. వరుసగా ఆరు హిట్ సినిమాలు ఖాతాలో వేసుకొని ఫుల్ జోష్‌లో కనిపిస్తున్నారు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా సూపర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. వరల్డ్ వైడ్ భారీ కలెక్షన్లు రాబట్టింది. ఇటీవల జపాన్‌లో కూడా రిలీజ్ అయి.. సంచలనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాలో హీరోలుగా నటించిన యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. పాన్ ఇండియా స్టార్లుగా అవతారమెత్తారు. వరుస హిట్ సినిమాలు అందుకోవడంతో ఎన్టీఆర్.. సినిమా స్టోరీ విషయంలో ఆచితూచీ అడుగులు వేస్తున్నారు.

 

బాలనటుడిగా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్.. ప్రస్తుతం స్టార్ హీరోగా ఎదిగాడు. అయితే ఎన్టీఆర్ రాజకీయాల్లో రావాలని మొదటి నుంచి తెలుగు రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్న విషయం తెలిసిందే. అప్పట్లో రాజకీయాల ప్రచారాల్లో కూడా పాల్గొన్నాడు. 2009 ఎన్నికల ప్రచారంలో ఎన్టీఆర్ పాల్గొన్నారు. ఆయన అప్పుడు చేసిన ప్రసంగాలు ఎంతో హైలెట్‌గా నిలిచాయి. ఏమైందో తెలియదు. ఆ తర్వాత ఎన్టీఆర్ రాజకీయాలకు దూరమయ్యాడు. 2018 ఎన్నికల్లో తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో తన సోదరి సుహాసిని పోటీ చేసింది. అప్పుడు కూడా ఎన్టీఆర్ ప్రచారంలో పాల్గొన్నాడు. అయితే ఇప్పుడు మళ్లీ ఎన్టీఆర్ రాజకీయ ప్రస్తావన గురించి వచ్చింది. తెలంగాణ మంత్రి ఎన్టీఆర్ రాజకీయాల్లో రావాలని చెప్పడం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.. ఖమ్మంలో జరిగిన చంద్రబాబు సభపై స్పందించాడు. తెలుగుదేశం పార్టీ (టీడీపీ) చంద్రబాబుది కాదని అన్నారు. ఆ పార్టీ ఎన్టీఆర్‌దేనని పేర్కొన్నారు. ఎన్టీఆర్ రాజకీయాల్లో రావాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. టీడీపీ అధ్యక్షుడిగా, ఏపీకి సీఎంగా అయ్యే అర్హత ఎన్టీఆర్‌కు ఉందని, ఎన్టీఆర్ సీఎం అవ్వాలని ఏపీ ప్రజలు కోరుకుంటున్నారని ఎర్రబెల్లి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు టీడీపీపై ప్రేమ ఉంటే.. ఎన్టీఆర్‌ను సీఎంగా చేయాలన్నారు. కాగా, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అయ్యాయి. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా.. ఏపీకి ఎన్టీఆర్ సీఎం అయితే బాగుంటుందని భావిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan Stone Attack: అమ్మా నాన్నేరీ అంటున్న పిల్లలు.. జగన్ పై దాడి కేసులో దుర్గారవు నిజంగా తప్పు చేశారా?

CM Jagan Stone Attack: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై దాడి ఘటనలో భాగంగా ఆటో డ్రైవర్ దుర్గారావును పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. జగన్ పై రాయి దాడి...
- Advertisement -
- Advertisement -