Niharika Konidela: తన భర్తతో ఆ విధంగా కనిపించిన నిహారిక.. ఫోటో వైరల్?

Niharika Konidela: సినీ ప్రియులకు నిహారిక కొణిదెల గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. డీ జూనియర్స్ షో ద్వారా యాంకర్ గా పరిచయమైన నిహారిక ఆ తర్వాత ఒక మనసు సినిమా తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఆ తర్వాత అరడజను సినిమాలు లో నటించి తెలుగునాట నటనలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. కానీ ఇండస్ట్రీలో ఎక్కువ కాలం నిలువలేకపోయింది.

ఇక నిహారిక కొణిదెల ఇటీవల ఒక పబ్ నేపథ్యంలో ఒంటరిగా పోలీసులకు పట్టుబడిన విషయం మనందరికీ తెలిసిందే. ఇక డ్రగ్స్ వ్యవహారంలో నిహారిక తో పాటు కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక తర్వాత రోజు నిహారిక స్టేషన్ నుంచి బయటకు వచ్చింది. నిహారిక తప్పు చేసిందో.. తప్పు చేయలేదో తెలియదు కానీ సోషల్ మీడియాలో నిహారికను నెటిజన్లు ఒక రేంజ్ లో ఆడిపోసుకుంటున్నారు.

కాగా గతంలో సోషల్ మీడియాలో యమా యాక్టీవ్ గా ఉండే నిహారిక ట్రోలర్స్ పెట్టె టార్చర్ తట్టుకోలేక సోషల్ మీడియాకి కొన్ని రోజులుగా దూరంగా ఉంది. కాగా కొంతకాలం తర్వాత జోర్దాన్ ట్రిప్ తో నిహారిక మళ్లీ సోషల్ మీడియాలో హడావిడి చేస్తుంది. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన అప్ డేట్స్ సోషల్ మీడియాలో పంచుకుంటుంది. ఇక ఇదే క్రమంలో తాజాగా నిహారిక ఒక ఫోటో ఇన్ స్టాగ్రామ్ స్టోరీ రూపంలో షేర్ చేసింది ప్రస్తుతం ఈ స్టోరీ వైరల్ గా మారింది.

ఆ ఫోటోలో నిహారిక తన భర్త చైతన్య జొన్నలగడ్డ ఒడిలో కూర్చుని ఎంతో అందంగా తన భర్త ముఖంలో ముఖం పెట్టి నవ్వుతూ ఎంతో ప్రశాంతంగా పాటలు వింటుంది. ఇక జిమ్ లో వీరిద్దరూ వర్కౌట్ పూర్తి చేసిన తర్వాత వీరిద్దరూ దంపతులు ఆ విధంగా సేద తీర్చుకుంటున్నారు. నిహారిక స్టోరీ చూసిన నెటిజన్లు ఒక రేంజ్ లో ఆశ్చర్యపోతున్నారు. ఈ ఫోటో చూడటానికి ఎంతో అందంగా కనిపిస్తుంది. ఇక ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

Related Articles

ట్రేండింగ్

CM Jagan Stone Attack: అమ్మా నాన్నేరీ అంటున్న పిల్లలు.. జగన్ పై దాడి కేసులో దుర్గారవు నిజంగా తప్పు చేశారా?

CM Jagan Stone Attack: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై దాడి ఘటనలో భాగంగా ఆటో డ్రైవర్ దుర్గారావును పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. జగన్ పై రాయి దాడి...
- Advertisement -
- Advertisement -