Niharika: నిహారికకు వార్నింగ్ ఇచ్చిన నాగబాబు.. ఏమైందంటే?

Niharika: మెగా ఫ్యామిలీలో ఏం జరిగినా హాట్ టాపిక్‌గా మారుతూ ఉంటుంది. ప్రతి చిన్న విషయం కూడా మీడియాలో ఫోకస్ అవుతుంది. ఆ ఒక్క ఫ్యామిలీ నుంచే దాదాపు 10 మంది హీరోలు, నటులు ఇండస్ట్రీలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అందుకే నిత్యం మెగా ఫ్యామిలీ గురించి వార్తలు వస్తూ ఉంటాయి. ఈ మధ్య నాగబాబు కూతురు నిహారికకు సంబంధించిన వ్యవహారాలు ఎక్కువగా బయటికి కనిపిస్తున్నాయి. అప్పట్లో పబ్‌లో దొరకడం, పోలీస్ స్టేషన్ వరకు వెళ్లడం పెద్ద సంచలనగా మారిన విషయం తెలిసిందే.

మెగా ఫ్యామిలీ నుంచి తొలిసారి నిహారిక హీరోయిన్‌గా బయటకు వచ్చి పలు సినిమాలు చేసింది. నాగబాబు ఒప్పుకోకపోయినప్పటికీ చిరంజీవి చెప్పడంతో ఆమె ముందుకొచ్చింది. తర్వాత ప్రొడ్యూసర్‌గా కొన్ని వెబ్ సిరీస్‌లు కూడా చేసింది. అయితే పెద్దగా వర్కవుట్ కాలేదు. దీంతో ఐపీఎస్ అధికారి కుమారుడు జొన్నలగడ్డ చైతన్యతో నిహారిక వివాహం చేశారు.

 

భర్తతో నిహారికకు విభేదాలు?

కొన్ని నెలలు బాగానే సాగిన వారి సంసారంలో చిన్నపాటి విభేదాలు వచ్చాయని తెలుస్తోంది. దీంతో ఇద్దరూ దూరంగా ఉంటున్నారని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. దీంతో ఆమెను రీసెంట్ గా నాగబాబు ఇంటికి పిలిచి క్లాస్‌ పీకాడని సమాచారం. ఇలాంటి పనులతో మన ఫ్యామిలీ పరువు తీయొద్దు. ఏదైనా ఉంటే మేం మాట్లాడుతాం. నువ్వు, అల్లుడు కలిసి ఉండండి అంటూ చెప్పుకొచ్చాడంట. దాంతో నిహారిక కూడా తండ్రి మాటను కాదనలేక చైతన్యతో కలిసి ఉండేందుకు ప్రయత్నిస్తోంది.

 

కాగా, నిహారిక మొదటి నుంచి అల్లరి చేష్టలు ఎక్కువగా చేస్తూ ఉండేది. పెళ్లి అయ్యాక కూడా వాటిని వదల్లేదు. ఆమె భర్తతో కలిసి నైట్‌ పార్టీలు చేసుకుని పెద్ద అల్లరి చేస్తోందని ఓ అపార్టుమెంట్‌ వారు పోలీస్‌ కేసు కూడా పెట్టారు. ఇలా వరుసగా వివాదాల్లో చిక్కుకుంటున్నామెకు మెగా ఫ్యామిలీ నుంచి గట్టి వార్నింగ్‌ కూడా వెళ్లిందనే టాక్‌ ఉంది. కానీ ఆమె మాత్రం అవేమీ పట్టించుకోకుండా తన ఇష్టం వచ్చినట్టే ఉంటుంది. ఇటీవల ఫారిన్ టూర్ వెళ్లిన ఆమె.. సెమీ బికినీ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేయగా, మెగా అభిమానులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కుటుంబ పరువు తీయొద్దంటూ కామెంట్స్ చేశారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -