Nikhil-Pallavi: భార్యతో నిఖిల్ విడాకులు అంటూ ప్రచారం.. నిజమేంటంటే?

Nikhil-Pallavi: ఏంటో ఈ మధ్య విడాకులు అనేది చాలా మామూలు విషయమవుతుంది. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీకి చెందిన నటీనటులకు మాత్రం ఇదొక సింపుల్ మేటర్ అయిపోయింది. ఇప్పటికే చాలామంది నటీనటులు సడన్ గా విడాకులు తీసుకొని షాకిచ్చారు. అయితే తాజాగా హీరో నిఖిల్ కూడా విడాకులు తీసుకోనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకు అసలు నిజం ఏంటో తెలుసుకుందాం.

 

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ గురించి అందరికీ పరిచయమే. తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ కుర్ర హీరో అతి తక్కువ సమయంలో అభిమానుల హృదయాలను గెలుచుకున్నాడు. తొలిసారిగా సంబరం సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన నిఖిల్ ఆ తర్వాత హ్యాపీ డేస్ సినిమాలో నటించి తన నటనకు మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు.

 

అలా ఆ తర్వాత స్వామిరారా, కార్తికేయ, ఎక్కడికి పోతావు చిన్నవాడా, కిరాక్ పార్టీ, అర్జున్ సురవరం సినిమాలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ప్రతాప్ దర్శకత్వంలో 18 పేజెస్ సినిమాలో కూడా నటించగా ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక ఇటీవలే కార్తికేయ 2 సినిమాలో నటించగా ఈ సినిమా మంచి సక్సెస్ అందుకుంది. అయితే ఇదంతా పక్కన పెడితే.. నిఖిల్ పల్లవి అనే తన ఫ్రెండ్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.

 

ఇక పెళ్లి తర్వాత ఈ జంట తమ సోషల్ మీడియా వేదికగా తెగ ఫోటోలు పంచుకుంటూ బాగా సందడి చేశారు. అయితే గత కొన్ని రోజుల నుండి వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయని.. పెళ్లి చేసుకున్నప్పటి నుంచి వీరి మధ్య సఖ్యత లేదంటూ.. అందుకే ఇప్పటివరకు ఏ గుడ్ న్యూస్ కూడా చెప్పలేదని.. దీంతో వీరు త్వరలో విడాకులు తీసుకోబోతున్నారని బాగా పుకార్లు వచ్చాయి.

 

దీంతో నిఖిల్ తాజాగా తన సోషల్ మీడియా వేదికగా తన భార్యతో దిగిన ఫోటో షేర్ చేస్తూ.. నువ్వు నా పక్కన ఉన్న ప్రతి సారి నాకు ఏదో తెలియని కొత్త ఫీలింగ్ అంటూ.. అద్భుతంగా ఉంది అంటూ షేర్ చేసుకున్నాడు. దీంతో తమ మధ్య ఎటువంటి విడాకుల ముచ్చట లేదని ఆ ఫోటో ద్వారా పుకార్లను కొట్టి వేశాడు నిఖిల్.

Related Articles

ట్రేండింగ్

AP Electricity: ఏపీలో విద్యుత్ కోతలు మొదలు.. పవర్ కట్ వల్ల జగన్ పవర్ కట్ అయ్యే ఛాన్స్ ఉందా?

AP Electricity: ఏపీలో కరెంటు కోతలు అనే మాట ఓ తరానికి ముందు విన్నాం. ఇప్పుడు అలాంటి మాట వినాల్సిన పని లేదనే అనుకుంటాం. పైగా రాష్ట్ర విభజన తర్వాత కరెంటు కోతలు...
- Advertisement -
- Advertisement -