Nithiin-Mithali Raj: హీరో నితిన్, క్రికెటర్ మిధాలీతో నడ్డా భేటీ వెనుక అసలు కారణం ఇదేనా?

Nithiin-Mithali Raj: తెలంగాణలో అధికారమే దిశగా పావులు కదుపుతున్న బీజేపీ వ్యూహత్మకంగా అడుగులు వేస్తోంది. మూడోసారి అధికారాన్ని దక్కించుకుని హ్యాట్రిక్ కొట్టేందుకు సీఎం కేసీఆర్ రంగం సిద్దం చేసుకుంటుండగా.. టీఆర్ఎస్ ను గద్దె దించేందుకు బీజేపీ శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తోంది. అస్త్రశస్త్రాలను సిద్దం చేసుకుంటోంది. ఉన్న అవకాశాలన్నింటినీ ఉపయోగించుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతోంది. అందులో భాగంగా తాజాగా సినీ గ్లామర్ పై బీజేపీ అధినాయకత్వం దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. సినీ గ్లామర్ ను పార్టీకి తెచ్చుకోవడం ద్వారా ప్రజలను ఆకర్షించే ప్లాన్ కు తెరలేపింది. సినీ హీరోలకు, నటీనటుమణులకు ప్రజల్లో ఉండే క్రేజ్ ను తమ పార్టీకి ఉపయోగించుకోవాలని చూస్తోంది.

అందులో భాగంగా సినీ, క్రీడా సెలబ్రెటీలతో పాటు వ్యాపార దిగ్గజాలను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. కేంద్ర హోంమత్రి అమిత్ షా తెలంగాన పర్యటనతో మొదలైన ఈ ప్లాన్.. తాజాగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పర్యటనతో మరింత వేగవంతమైంది. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తో అమిత్ షా భేటీ అవ్వగా.. తాజాగా టీమిండియా మహిళల మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్, హీరో నితిన్ తో జేపీ నడ్డా సమావేశమయ్యారు. సెలబ్రెటీలతో భేటీ ద్వారా తెలంగాణతో పాటు సౌత్ ఇండియాలో బలపడాలని బీజేపీ చూస్తున్నట్లు ఈ వరుస భేటీ ద్వారా స్పష్టతమైపోతుంది. వ్యాపార దిగ్గజం రామోజీరావుతో అమిత్ షా భేటీ ద్వారా మీడియా సపోర్ట్ బీజేపీ ఆశిస్తోంది.

నార్త్ ఇండియాలో సినీ, క్రీడా, వ్యాపార దిగ్గజాలను బీజేపీ ఇప్పటికే ఆకర్షించే బలం సంపాదించుకుంది. కర్ణాటకలో సుదీప్, యశ్ లాంటి మీరోలను ఆకట్టుకుని అక్కడ పాగా వేసింది. ఇప్పుడు తెలంగాణలో కూడా అదే వ్యూహాన్ని బీజేపీ అమలు చేస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సెలబ్రెటీలతో వరుస భేటీ వెనుక మర్మం అదేనంటున్నారు. శనివారం వరంగల్ జిల్లాలో బండి సంజయ్ మూడో విడత పాదయాత్ర ముగింపు సభలో జేపీ నడ్డా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మిథాలీ రాజ్ తో పాటు హీరో నితిన్ తో విడివిడిగా భేటీ అయ్యారు.

ఈ భేటీలో కేంద్రమంత్రి కిషన్, రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా పాల్గొన్నారు. ఈ భేటీలపై లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మిథాలీ రాజ్, నితిన్ మోదీ పాలనను మెచ్చుకున్నారని, బీజేపీ పాలన పట్ల సానుకూలంగా ఉన్నారని తెలిపారు. బీజేపీ తరపున ప్రచారం చేయడానికి మిథాలీ, నితిన్ సిద్దంగా ఉన్నట్లు లక్ష్మణ్ కీలక ప్రకటన చేశారు. జేపీ నడ్డాతో భేటీలో రాజకీయ అంశాలే చర్చకు వచ్చాయని ప్రకటించారు. దీంతో బీజేపీ తరపున ప్రచారం చేయించుకోవడానికి వారిద్దరితో నడ్డా భేటీ అయినట్లు క్లారిటీ వచ్చింది.

దీనిని బట్టి చూస్తే ఎన్టీఆర్ తో అమిత్ షా భేటీలో రాజకీయ చర్చలే జరిగినట్లు అర్ధమవుతుంది. సినీ, క్రీడా, వ్యాపార రంగాల్లోని ప్రముఖ వ్యక్తులను ఆకర్షించడం ద్వారా తెలంగాణతో పాటు సౌత్ ఇండియాలో తమకు కలిసివస్తుందనేది బీజేపీ స్కెచ్ గా తెలుస్తోంది. మరి ఎన్నికల నాటికి ఇంకెంతమంది హీరోలను బీజేపీ తన బుట్టలో వేసుకుంటుంది.. టాలీవుడ్ లో ఎంతమంది సినీ నటులు కాషాయం వైపు మళ్లుతారు.. ఎంతమంది ప్రచారంలోకి దిగుతారు అనేది చూడాలి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu: వారికి 500 యూనిట్ల వ‌ర‌కు విద్యుత్‌.. చంద్రబాబు హామీతో ఆ వర్గం ఓట్లు టీడీపీకే వస్తాయా?

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు అన్ని వర్గాల ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని వరాల జల్లు కురిపిస్తున్నారు. నిరుద్యోగులు, రైతులు, మహిళలు, చేనేత కార్మికులు ఇలా.. ఒక్కొక్కరికి ఏం కావాలి? వాళ్లకి ఎలాంటి...
- Advertisement -
- Advertisement -