Nikita Reddy: బీజేపీ నుంచి పోటీలోకి హీరో నితిన్ చెల్లి? అక్కడ నుంచి బరిలోకి

Nikita Reddy: హీరో నితిన్ గతంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలవడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆయన నటించిన మాచర్ల నియోజకవర్గం సినిమా గురించే జేపీ పడ్డా కలిశారనే వార్తలు వచ్చాయి. కానీ మాచర్ల నియోజకవర్గం నుంచి హిట్ కాలేదు. అంతేకాకుండా ఆ సినిమాలో పొలిటికల్ బ్యాక్ డ్రాప్, సామాజిక సేవ లాంటి అంశాలు కూడా ఏం లేవు. ఒక పక్కా కమర్షియల్ సినిమా అది. అంటి సినిమా చూసి జేపీ నడ్డా చూశారని ఎవరూ అనుకోరు. కేవలం రాజకీయపరంగానే నితిన్ ను జేపీ నడ్డా కలిశారనేది అర్ధమవుతుంది. నితిన్ తెలంగాణకు చెందిన వ్యక్తి. అంతేకాకుండా తెలంగాణలో ఆయనకు చాలా పాపులారిటీ ఉంది. పవన్ కల్యాణ్ కు నితిన్ వీరాభిమాని. దాని వల్ల నితిన్ ను కలవడం ద్వారా తెలంగాణలోని యువత బీజేపీ పట్ల ఆకర్షితులు అవుతుందనే రాజకీయ స్వప్రయోజనాల కోసం నితిన్ ను జేపీ నడ్డా కలిశారని తెలుస్తోంది.

అయతే నితిన్ బీజేపీ నాయకులను కలవడం వెనుక ఒక వార్త బలంగా వినిపిస్తోంది. తన సోదరి నిఖితా రెడ్డి కోసం జేపీ నడ్డాను నితిన్ కలిసినట్లు అర్ధమవతుంది. నిఖితా రెడ్డి ఇప్పటికే పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహించారు. ఆమె నిర్మాతగా చేసిన పలు సినిమాలు హిట్ కావడంతో టాలీవుడ్ లో ఆమె పేరు చాలామందికి పరిచయం అయింది. అయితే సినిమాల పరంగానే కాకుండా రాజకీయాల్లోకి కూడా రావాలని నిఖితా రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. టీఆర్ఎస్ లో ఇప్పటికే టికెట్ కోసం భారీ పోటీ ఉంది. దీంతో టీఆర్ఎస్ లో చేరితే వచ్చే ఎన్నికలలో పోటీ చేయడానికి టికెట్ ఉండదు.

ఇక కాంగ్రెస్ లో కూడా టికెట్లకు అలాగే భారీ పోటీ ఉంటుంది. అందుకే తెలంగాణలో ఇప్పుడిప్పుడు బలపడుతున్న బీజేపీలో చేరాలని నితిన్ సోదరి నిఖితా రెడ్డి ఆసక్తి చూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎప్పటినుంచో రాజకీయాల్లోకి రావాలనే ఆలోచనలో ఆమె ఉన్నారు. దీంతో తన సోదరి నిఖితా రెడ్డి కోసం జేపీ నడ్డాను నితిన్ కలిశారని చెబుతుననారు. వచ్చే ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుంచి బీజేపీ తరపున పోటీ చేసేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. హీరో నితిన్ బాగా పేరున్న డిస్ట్రిబ్యూటర్. అంతేకాకుండా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో సినిమా రంగానికి చెందిన హీరోలు, హీరోయిన్లు, నటలు, నటీమణులు ఎక్కువమంది ఉంటారు.

నితిన్ ఫ్యామిలీతో పాటు నిఖితా రెడ్డి నిర్మాతగా టాలీవుడ్ లో అందరితో సత్సంబంధాలు ఉన్నాయి. అందుకే బీజేపీ తరపున టికెట్ కోసం నిఖితా రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆమెకు టికెట్ ఇవ్వాల్సిందిగా కోరేందుకు జేపీ నడ్డాను నితిన్ కలిసినట్లు తెలుస్తోంది. నితిన్ కు తెలంగాణలో బాగా ఫ్యాన్స్ ఉన్నందున రాష్ట్రంలో అధికారంలోకి రావాలని ఉవ్విళ్లూగుతున్న బీజేపీకి కలిసిచొచ్చే అవకాశముంది. అందేకే నితిన్ ను జేపీ నడ్డా కలిసినట్లు టాక్ నడుస్తోంది.

సినీ సెలబ్రెటీల పట్ల ప్రజల్లో ఉన్న క్రేజ్ ను ఉపయోగించుకోవాలని బీజేపీ చూస్తోంది. అందుకే సినీ హీరోలను తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే జూనియర్ ఎన్టీఆర్ తో అిమిత్ షా భేటీ అయ్యారు. ఇక టీమిండియా మాజీ కెప్టెన్ మిధాలీ రాజ్ గతంలో అమిత్ షా హైదరాబాద్ వచ్చిన సమయంలో వెళ్లి కలిశారు. అంతేకాకుండా ఇటీవల ఢిల్లీలో కూడా అమిత్ షాను మిథాలీ రాజ్ కలిశారు. దీంతో మిధాలీ రాజ్ బీజేపీలో చేరడం ఖాయంగా కనిపిస్తుంది. హైదరాబాద్ కు చెందని మిధాలీ రాజ్ బీజేపీలో చేరితే అది తెలంగాణలో కాషాయ పార్టీకి ఎంతోకొంత ఉపయోగపడుతుంది.

సినీ ఇండస్ట్రీలోని ప్రముఖలతో పాటు క్రీడా, వ్యాపార రంగాల్లో ఉన్న ప్రముఖ వ్యక్తులను ఆకర్షించేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. సినీ గ్లామర్ ను పెంచుకోవడం ద్వారా ప్రజలు పార్టీకి ఆకర్షితులవుతారని బీజేపీ భావిస్తోంది. మరి బీజేపీ ప్లాన్ లు వర్క్ అవుట్ అవుతాయా. లేదా అనేది చూడాలి.

Related Articles

ట్రేండింగ్

తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి ప్రధానమైన కారణాలివే.. ఆ తప్పులే ముంచేశాయా?

తెలంగాణ రాష్ట్రంలో మూడోసారి అధికారాన్ని సొంతం చేసుకుంటామని కాన్ఫిడెన్స్ తో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. 2014, 2018 ఎన్నికల్లో విజయం సాధించిన ఈ పార్టీకి 2023 ఫలితాలు మాత్రం...
- Advertisement -
- Advertisement -