Nitish Kumar: మోదీకి చెక్ పెట్టేందుకు నితీష్ సరికొత్త వ్యూహం.. ఆ రాష్ట్రం నుంచి ఎంపీ బరిలోకి?

Nitish Kumar: దేశ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఎన్డీయేను ఢీకొట్టేందుకు బీజేపీయేతర పార్టీలన్నీ ఇప్పటినుంచే పావులు కదుపుతున్నాయి. ఎన్డీయేకు వ్యతిరేకంగా పార్టీలన్నీ ఏకమయ్యేందుకు ఇప్పటినుంచే రంగం సిద్దం చేసుకుంటన్నాయి. ప్రతిపక్ష పార్టీలన్నీ ఒకే గొడుకు కిందకు వచ్చి మోదీని ఢీకొట్టేందుకు రూటు మ్యాప్ ను రెడీ చేసుకునే పనిలో ఉన్నాయి. తెలంగాణ సీఎం కేసీఆర్ మోదీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో కొత్త పార్టీ పెట్టే యోచనలో ఉన్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా పర్యటించి బీజేపీయేతర పార్టీలకు సంబంధించిన నేతలను కలిసిన కేసీఆర్.. ఎన్డీయేకకు వ్యతిరేకంగా అందరూ ఏకమవ్వాల్సింగా సూచించారు. ఇటీవల కొత్త జాతీయ పార్టీపై ప్రకటన జారీ చేసిన ఆయన.. పార్టీ ఏర్పాటు తర్వాత దేశవ్యాప్తంగా దళితులు, రైతులతో బహిరంగ సభలు నిర్వహించేందుకు సిద్దమవుతున్నారు.ః

అయితే దేశ రాజకీయాల్లో సీనియర్ నేతగా పాపులర్ అయిన బీహార్ సీఎం నితీష్ కుమార్ కూడా ప్రధాని మోదీకి వ్యతిరేకంగా వ్యూహలు రచిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలన్నింటీని తాను ఏకం చేస్తానని ఇప్పటికే నితీశ్ ప్రకటించారు. ఇటీవల కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో పాటు రాహుల్ గాంధీతో ఆయన భేటీ అయ్యారు. కాంగ్రెస్ తో కలిసి ప్రతిపక్షాలను ఏకం చేసేందుకు ఆయన ప్రయత్నాలు ప్రారంభించారు. ప్రతిపక్ష ప్రధాని అభ్యర్థిగా ఆయన రేసులో ముందు వరుసలో ఉన్నారు. ఎన్డీయే నుంచి బయటకొచ్చిన తర్వాత జాతీయ రాజకీయాల్లోకి మోదీని వ్యతిరేకించే శక్తులలో ఆయన చేరారు. ప్రతిపక్ష కూటమి దేశంలో అధికారంలోకి వస్తే వెనుకబడిన రాష్ట్రాలకకు ప్రత్యేక హోదా ఇస్తామంటూ హామీ కూడా ఇచ్చేస్తారు.

అయితే ఎన్డీయేను ఢీకొట్టడంలో భాగంగా నితీష్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకకున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో యూపీ నుంచి ఆయన లోక్ సభకు పోటీ చేసే ఆలోచనలో ఉన్నారు. ఏ పార్టీ అయినా కేంద్రంలో అధికారంలోకి రావాలంటే అదిపెద్ద రాష్ట్రమైన యూపీ కీలకం. యూపీలో మొత్తం అత్యధికంగా 80 ఎంపీ స్థానాలు ఉన్నాయి. ఇక్కడ అత్యధిక స్థానాలు గెలుచుకుంటే అధికారంలోకి రావడం చాలా సులువు. ప్రస్తుతం యూపీలో బీజేపీకి 65 ఎంపీ స్థానాలు ఉన్నాయి. దీంతో వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో ఎన్డీయేను దెబ్బకొట్టాలంటే యూపీలో బీజేపీకి చెక్ పెట్టాలని నితీష్ వ్యూహరచన చేశారు. దీంతో యూపీలో అఖిలేష్ కుమార్ ఆధ్వర్యంలోని సమాజ్ వాదీ పార్టీని కలుపుకోని పోవాలని నితీష్ బావించినట్లు ప్రచారం జరుగుతోంది.

మోదీకి వ్యతిరేకంగా ఉన్న అఖిలేష్ యాదవ్ కూడా నితీశ్ కు మద్దతు ఇచ్చేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో నితీశ్ పోటీ చేస్తే మద్దతు ఇచ్చేందుకు తాము సిద్దంగా ఉన్నట్లు అఖిలేష్ యాదవ్ సంకేతాలు ఇచ్చారు. ఈ కారణంతో యూపీలోని పూల్ పుర్ పార్లమెంట్ స్థానం నుంచి నితీశ్ కుమార్ పోటీ చేస్తారిన జేడీయూ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే జేడీయూ జాతీయ అధ్యక్షుడు లలన్ సింగ్ యూపీ నుంచి నితీష్ పోటీ చేస్తారని ప్రకటించారు. పూల్ పుర్ లేదా అంబేడ్కర్ నగర్, మిర్జాపూర్ లోక్ స్థానాలను పరిశీలిస్తున్నట్లు జేడీయూ వర్గాలు చెబుతున్నాయి. నితీశ్ ఎక్కడి నుంచి పోటీ చేసినా తమ మద్దతు ఆయనకు ఉంటుందని అఖిలేష్ కుమార్ ఇప్పటికే ప్రకటించారు.

దీంతో యూపీలో సమాజ్ వాదీ పార్టీ మద్దతుతో పోటీ చేసి బీజేపీకి లోక్ సభ సీట్లు తగ్గించేలా నితీష్ ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇక్కడ సీట్లు తగ్గడం ద్వారా కేంద్రంలో ఆ పార్టీ అధికారాన్ని కోల్పోతుందనేది నితీశ్ భావన. అలబాహాద్ లోని పూల్ పుర్ నియోజకవర్గం ప్రధాని మోదీ ఎంపీగా ఉన్న వారణాసికి 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. అందుకే నితీశ్ ఆ లోక్ సభ నియోజకర్గం నుంచి పోటీ చేసేందుకకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. దీని వల్ల మోదీకి గట్టి సమాధానం చెప్పినట్లు అవుతుందని నితీష్ భావిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Janasena: ఏపీలోని 21 అసెంబ్లీ స్థానాలలో జనసేన పరిస్థితి ఇదీ.. అన్ని స్థానాల్లో గెలిచే ఛాన్స్ ఉందా?

Janasena: మే 13వ తేదీ జరగబోయే అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా జనసేన పార్టీ 21 స్థానాలలో పోటీ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా జనసేన పోటీ చేస్తున్నటువంటి ఈ స్థానాల విషయంలో...
- Advertisement -
- Advertisement -