Nitya Menon: పెళ్లిపై నిత్యామీనన్ షాకింగ్ కామెంట్స్

Nitya Menon: కేరళ కుట్టి నిత్యామీనన్ తెలుగులో తనకంటూ ఓ క్రేజ్ సంపాదించుకుంది. అలా మొదలైంది, ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే, ఓకే బంగారం, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, సన్నాఫ్ సత్యమూర్తి, భీమ్లా నాయక్ వంటి సినిమాల్లో నటించి ప్రేక్షకుల అభిమానాన్ని పొందింది. అయితే కొన్నిరోజులుగా నిత్యామీనన్ పెళ్లి చేసుకోబోతుందంటూ వార్తలు షికారు చేస్తున్నాయి. దీంతో నిత్యామీనన్ పెళ్లి చేసుకునే వ్యక్తి ఎవరు అంటూ పలువురు ఆరా తీస్తున్నారు.

 

ఈ నేపథ్యంలో తన పెళ్లి వార్తలపై నిత్యామీనన్ స్వయంగా స్పందించింది. తాను పెళ్లి చేసుకుంటున్నట్లు వస్తున్న వార్తలు కేవలం రూమర్లు అంటూ నిత్య తిప్పికొట్టింది. పెళ్లి అనేది సోషల్ సెటప్ అని.. తాను ఆచార్య సంప్రదాయాలకు విలువ ఇచ్చే వ్యక్తిని అని మాట్లాడింది. అంతేకాకుండా పెళ్లి ఫైనాన్షియల్ విషయాలతో ముడిపడి ఉందని.. అందుకే తనకు పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం ప్రస్తుతానికైదే లేదని స్పష్టం చేసింది.

 

తనను బాగా చూసుకునే వ్యక్తి తారసపడినప్పుడు పెళ్లి గురించి అప్పుడు ఆలోచిస్తానని.. తనను మించి ఆలోచన చేసేవాళ్లు ఎవరైనా ఉంటే వాళ్లను కచ్చితంగా పెళ్లి చేసుకుంటానని నిత్యామీనన్ సెలవిచ్చింది. ఆమె ప్రస్తుతం పలు సినిమాలు, వెబ్ సిరీస్‌లలో నటిస్తూ కెరీర్‌లో ముందుకు సాగుతోంది. ఇటీవల తాను ప్రెగ్నెంట్ అయ్యానంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి ఒక్కసారిగా నిత్యామీనన్ కలకలం రేపింది. దీంతో పెళ్లి కాకుండానే గర్భవతి అయిన నిత్యామీనన్ అంటూ పెద్దఎత్తున వార్తలు వైరల్ అయ్యాయి.

 

నిత్యామీనన్ నిజంగానే గర్భవతా?
నిత్యామీనన్ గర్భవతి అన్నది కేవలం పబ్లిసిటీ స్టంట్ మాత్రమే. ఓ సినిమాలో ఆమె గర్భవతిగా నటిస్తుండటంతో ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. వండర్ ఉమెన్ అనే సినిమాలో నోరా అనే గర్భిణీ స్త్రీ పాత్రలో ఆమె నటిస్తోంది. ఈ మేరకు తనతో పాటు మరో ముగ్గురు నటీమణులను కారులో ఎక్కించుకుని.. ఇలా నలుగురు గర్భవతులు కారులో వెళ్తుంటే ఎప్పుడైనా చూశారా అని నిత్యా ఓ పోస్ట్ పెట్టింది. దీంతో సినిమా ప్రమోషన్ కోసం ఫేక్ గర్భాలతో రోడ్డు ఎక్కితే నిజమైన గర్భవతులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని కొందరు కామెంట్ చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

ఒకరిద్దరు లుచ్చాగాళ్ళ ఫోన్లు టాప్ చేసి ఉండొచ్చు.. కేటీఆర్ కామెంట్లతో నిజాలు తెలిసిపోయాయిగా!

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వివాదంలో వెంట్రుక లాగితే డొంక కలుగుతోంది. ప్రతిరోజు పేరు తెరపైకి కొత్త పేర్లు వస్తున్నాయి. గురువారం మరో ఇద్దరు పోలీసులను విచారణ బృందం అదుపులోకి తీసుకుంది. వారిలో టాస్క్...
- Advertisement -
- Advertisement -