Nivetha Thomas: నువ్వు అలా ఉంటావు ఆ హీరోతో ఎలా చేస్తావ్ అంటూ నివేదాను అవమానపరిచిన ప్రొడ్యూసర్?

Nivetha Thomas: తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు అందాల భామ నివేదా థామస్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. జెంటిల్ మెన్ సినిమా తో హీరోయిన్ గా అడుగు పెట్టిన ఈ ముద్దు గుమ్మ. ఆ సినిమాలోని హీరో నానితో తన రొమాన్స్ మరో స్థాయిలో పండించింది. అలా మొదటి సినిమాతోనే తన నటనకు గాను ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత నిన్ను కోరి, వంటిపలు సినిమాలో నటించి నటిగా తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకుంది.

ఈ క్రమంలోని ఈ అమ్మడు తన అందంతో అడపా దడపా కొంత ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సంపాదించుకుంది. ఇక నివేదా కాస్త చూడ్డానికి బొద్దుగా ఉన్నప్పటికీ హీరోయిన్ గా ప్రేక్షకులను బాగా మెప్పిస్తుంది. అంతేకాకుండా ఏమాత్రం గ్లామర్ రోల్స్ చేయకుండా.. తన చక్కటి అందంతో స్కిన్ షో చేయకుండా ఇండస్ట్రీలో హీరోయిన్ గా మెప్పిస్తుంది. ఇక పాత్రల విషయంలో ఏమాత్రం నిరాశ చెందకుండా హీరో చెల్లి పాత్రలు కూడా చేస్తుంది.

ఏదైనా నివేదా థామస్ తనకు నచ్చిన పాత్రలు చేస్తూ ఇండస్ట్రీలో హీరోయిన్ గా హడావిడి చేస్తుంది కానీ.. వల్గర్ రోల్స్ మాత్రం చేయడం లేదు. ఇదిలా ఉంటే ఈమెను ఒక ప్రొడ్యూసర్ ఒక మూవీ షూటింగ్ సమయంలో ఘోరంగా అవమానించాడట. ఒక పెద్ద హీరో సినిమాలో ఆమెకు ఓ డైరెక్టర్ అవకాశం ఇచ్చాడట. కానీ సదరు ప్రొడ్యూసర్ మాత్రం ఆమెను అనరాని మాటలు అన్నాడట.

నువ్వు పొట్టి దానివి.. హీరో పక్కన డాన్స్ ఎలా చేస్తావు అసలు సెట్ కాదంటూ ఆమెను ఘోరంగా అవమానించినట్లు తెలుస్తుంది. అంతేకాకుండా ఆ డైరెక్టర్ కు చెప్పి ఆమెను సినిమా నుంచి తీపించేసాడట. ప్రస్తుతం ఈ విషయం తెలిసిన నివేదా థామస్ అభిమానులు ఆ ప్రొడ్యూసర్ గురించి ఒక రేంజ్ లో కోపం వ్యక్తం చేస్తున్నారు. మరి ఆ ప్రొడ్యూసర్ ఎవరు అనే విషయం మాత్రం బయటకు రాలేదు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu: వారికి 500 యూనిట్ల వ‌ర‌కు విద్యుత్‌.. చంద్రబాబు హామీతో ఆ వర్గం ఓట్లు టీడీపీకే వస్తాయా?

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు అన్ని వర్గాల ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని వరాల జల్లు కురిపిస్తున్నారు. నిరుద్యోగులు, రైతులు, మహిళలు, చేనేత కార్మికులు ఇలా.. ఒక్కొక్కరికి ఏం కావాలి? వాళ్లకి ఎలాంటి...
- Advertisement -
- Advertisement -