Telangana: తెలంగాణలో సీబీఐకి అనుమతి రద్దు చేయడం వెనుక కారణాలు ఇవే?

Telangana: తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. సీబీఐ దర్యాప్తుకు రాష్ట్రంలో అనుమతి రద్దు చేసింది. గతంలో అనుమతి ఇస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహకరించుకుంది. దీనికి సంబంధించి ఆగస్టు 30న తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఇప్పుడు ఆలస్యంగా ఆ జీవో వివరాలు బయటపెట్టాయి. ఇక నుంచి తెలంగాణలో ఏ కేసులోనైనా సీబీఐ దర్యాప్తు చేపట్టాలంటే ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని ప్రభుత్వం తన జీవోలో తెలిపింది. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం సంచలనంగా మారింది.

తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను మధ్యవర్తుల ద్వారా బీజేపీ కొనుగోలు చేసే ప్రయత్నం చేయడం పెద్ద దుమారం రేపుతోంది. అలాగే ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో చిక్కుకోవడం కలకలం రేపుతోంది. టీఆర్ఎస్ నేతలతో సంబంధాలు ఉన్న పలువురు వ్యక్తులను ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో ఈడీ, సీబీఐ అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకుని ప్రశ్నిస్తోంది. ఎమ్మెల్సీ కవిత పేరును కూడా సీబీఐ ఎఫ్ఐఆర్ లో చేర్చే అవకాశముందనే ప్రచారం జరుగుతోంది. దీంతో సీబీఐ దర్యాప్తుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి రద్దు చేయడం వివాదాస్పదంగా మారుతోంది.

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారంకి సంబంధించి సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో బీజేపీ పిటిషన్ వేసింది. సీబీఐ లేదా సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణకు ఆదేశాలు జారీ చేయాలంటూ పిటిషన్ లో బీజేపీ పేర్కొంది. ఇలాంటి తరుణంలో రాష్ట్రంలో సీబీఐకు తెలంగాణ ప్రభుత్వం నో ఎంట్రీ బోర్డు పెట్టడం సంచలనంగా మారింది. ఇక కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందని, సీబీఐతో విచారణ చేయించాలని ప్రతిపక్ష పార్టీలన్నీ కోరుతున్నాయి. ఇటీవల వైఎస్సార్ టీపీ అధినేత వైఎస్ షర్మిల కూడా ఢిల్లీకి వెళ్లి కాళేశ్వరం అవినీతిపై సీబీఐకు ఫిర్యాదు చేసింది. సీబీఐ డైరెక్టర్ ను షర్మిల కలిశారు. కాళేశ్వరంలో జరిగిన అవకతవకలకు సంబంధించి షర్మిల కీలక ఆధారాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.

దీంతో ముందుచూపుతోనే కేసీఆర్ రాష్ట్రంలో సీబీఐపై ఆంక్షలు విధించినట్లు చెబుతున్నారు. గతంలో చాలా రాష్ట్రాలు సీబీఐకి అనుమతి రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. పశ్చిమబెంగాల్, కర్ణాటక, కేరళతో పాటు పలు రాష్ట్రాలు కూడా గతంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నాయి. గత టీడీపీ హాయాంలో ఏపీ కూడా సీబీఐకి అనుమతి రద్దు చేస్తూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత జగన్ సర్కార్ వచ్చిన తర్వాత తిరిగి సీబీఐకి అనుమతి ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం సీబీఐను నిర్వీర్యం చేస్తోందని, సీబీఐను ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టేందుు ఉపయోగించుకుంటుందనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. దీంతో చాలా రాష్ట్రాలు సీబీఐకి తమ రాష్ట్రాల్లో అనుమతి రద్దు చేశాయి. ఇప్పుడ తెలంగాణ ప్రభుత్వం కూడా బాటలో నడిచింది.

Related Articles

ట్రేండింగ్

CM Jagan Stone Attack: అమ్మా నాన్నేరీ అంటున్న పిల్లలు.. జగన్ పై దాడి కేసులో దుర్గారవు నిజంగా తప్పు చేశారా?

CM Jagan Stone Attack: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై దాడి ఘటనలో భాగంగా ఆటో డ్రైవర్ దుర్గారావును పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. జగన్ పై రాయి దాడి...
- Advertisement -
- Advertisement -