Modi: ఏపీ పర్యటనకు ప్రధాని మోదీ.. పవన్ కల్యాణ్‌కు అందని ఆహ్వానం

Modi: ప్రధాని మోదీ విశాఖ పర్యటనకు రానున్న విషయం తెలిసిందే. ఈ నెల 11,12వ తేదీలలో విశాఖలో మోదీ ఉండనున్నారు. పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. ప్రధాని మోదీ పర్యటనకు ఇప్పటికే అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. విశాఖ జిల్లా కలెక్టర్ తాజాగా ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రధాని పర్యటనకు పకడ్బంధీగా ఏర్పాట్లు చేయాలని, మిగిలిన పనులు ఏమైనా ఉంటే వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం నిర్మించనున్న విశాఖ రైల్వేస్టేషన్ నూతన భవనాలకు మోదీ శంకుస్థాపన చేయనున్నారు.

 

 

అలాగే రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తోన్న భోగాపురం ఎయిర్ పోర్ట్ కి కూడా మోదీతో శంకుస్థాపన చేయించాలని జగన్ సర్కార్ భావిస్తోంది. అలాగే కేంద్ర ప్రభుత్వం నిర్మించనున్న గిరిజన యూనివర్సిటీ కూడా మోదీ శంకుస్థాపన చేయనున్నారని తెలుస్తోంది. విశాఖలో ఒక రోజు రాత్రి మోదీ బస చేయనున్నారు. కానీ మోదీ రెండు రోజుల పాటు విశాఖలో ఉండనుండగా.. బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ఎలాంటి ఇన్విటేషన్ రాలేదని తెలుస్తోంది. మోదీ పర్యటనకు హాజరుకావాల్సిందిగా కేంద్రం నుంచి ఆహ్వానం అందలేదని చెబుతున్నారు.

రైల్వే స్టేషన్ భవనాలను ప్రారంభించిన అనంతరం విశాఖ ఏయూ ఇంజినీరింగ్ కాలేజీలో మోదీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభకు రావాల్సిందిగా పవన్ కల్యాణ్ కు ఎలాంటి ఇన్విటేషన్ రాలేదట. గత కొంతకాలంగా బీజేపీకి పవన్ దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. విజయవాడలోని నోవాటెల్ హోటల్ లో చంద్రబాబునును కలిసిన తర్వాత బీజేపీకి పవన్ పూర్తిగా దూరమైనట్లు కనిపిస్తోన్నారు. అలాగే జగన్ కూడా బీజేపీ సపోర్టును ఇంకా కోరుకుంటున్నారు. రాష్ట్ర సీఎం హోదాలో ప్రధాని పర్యటనకు జగన్ హాజరువుతారు. జగన్ తో పవన్ కు పడదు గనుక మోదీ పర్యటనకు పవన్ ను ఆహ్వానించలేదని చెబుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Viveka Case: వివేకా హత్య కేసులో మరో షాకింగ్ ట్విస్ట్.. ఆ పరీక్ష కీలకమా?

Viveka Case: వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో భాగంగా రోజురోజుకు కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇలా ఆయన హత్య కేసులో నిందితులను కనుగొనడం కోసం సిబిఐ అధికారులు పెద్ద ఎత్తున...
- Advertisement -
- Advertisement -