Keerthy Suresh: కీర్తి సురేష్ కు ఎవరూ సాటిరారుగా.. అలా చేయడం ఆమెకే సాధ్యమా?

Keerthy Suresh: అలనాటి మహానటి అంటే అందరికీ సావిత్రి గుర్తుకువస్తుంది. కానీ ఈ కాలం నాటి మహానటి అనగానే అందరికీ గుర్తొచ్చే పేరు కీర్తి సురేష్. బాలనటిగా ఎన్నో సినిమాలలో నటించిన కీర్తి సురేష్ ఆ తర్వాత నేను శైలజ సినిమా ద్వారా హీరోయిన్ గా టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. ఆ సినిమా మంచి హిట్ అవ్వటంతో హీరోయిన్ గా కీర్తి సురేష్ కి కూడా మంచి గుర్తింపు లభించింది.

 

ఆ తర్వాత తెలుగు, తమిళ్ భాషలలో స్టార్ హీరోల సరసన నటించిన స్టార్ హీరోయిన్ గా మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. ఇక కీర్తి సురేష్ జీవితాన్ని మలుపు తిప్పిన ఏకైక సినిమా మహానటి. కీర్తి సురేష్ సినీ జీవితం మహానటి సినిమాకి ముందు ఒకలాగా ఆ సినిమా తర్వాత మరొక లాగా ఉంది. మహానటి సావిత్రి జీవిత కథతో రూపొందిన ఈ సినిమాలో సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ జీవించేసింది. ఆ సినిమాలో కీర్తి సురేష్ నటనకు సినీ విమర్శకుల ప్రశంసలు దక్కటమే కాకుండా ఎన్నో అవార్డులు కూడా వరించాయి.

ఇదిలా ఉండగా ప్రస్తుతం కీర్తి సురేష్ దసరా సినిమా ద్వారా వచ్చింది. నాని హీరోగా నటించిన దసరా సినిమాలో కీర్తి సురేష్ అద్భుతమైన పాత్రలో నటించింది. డి గ్లామర్ పాత్రలో నటించిన కీర్తి సురేష్ తన నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇది కీర్తి కెరీర్ లో ఒక ప్రయోగాత్మక చిత్రంగానే చెప్పుకోవచ్చు. ఒక నటి ఎలాంటి పాత్ర అయినా కూడా చేసి తీరాలని నిరూపించింది కీర్తి సురేష్. ఇటీవల దసరా సినిమా ప్రమోషనల్ ఇంటర్వూస్ చూసిన వారు అందుకే కదా నిన్ను మహానటి అనేది అంటున్నారు.

 

సినిమాలలో కత్తి పట్టి యుద్ధం చేసే సన్నివేశాలు అయినా, పోరాట సన్నివేశాలు అయినా, డి గ్లామర్ రోల్స్ అయినా ఎలాంటి మొహమాటం లేకుండా తన పాత్రకు మాత్రం ప్రాధాన్యత ఉండేలా కీర్తీ చూసుకుంటుంది. ఇక దసరా సినిమా మొదటి రోజు షూటింగ్ లో హీరోయిన్ పేడ కలిపే సన్నివేశం ఉండగా అయితే కీర్తి లాంటి ఒక స్టార్ హీరోయిన్ ఇలా పేడ తీయడం జరగదు అని ఆర్ట్ డిపార్ట్మెంట్ వారి చేత నకిలీ పేడ లాంటిది ఒకటి తయారు చేయించారు. అయితే ఆమె నిజమైన పేడ ఎత్తడానికి ఎలాంటి సంశయం చూపించకుండా చాల సహజంగా చేసిందట.దీంతో మహానటి అనే బిరుదు ఊరికే రాలేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

ఒకరిద్దరు లుచ్చాగాళ్ళ ఫోన్లు టాప్ చేసి ఉండొచ్చు.. కేటీఆర్ కామెంట్లతో నిజాలు తెలిసిపోయాయిగా!

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వివాదంలో వెంట్రుక లాగితే డొంక కలుగుతోంది. ప్రతిరోజు పేరు తెరపైకి కొత్త పేర్లు వస్తున్నాయి. గురువారం మరో ఇద్దరు పోలీసులను విచారణ బృందం అదుపులోకి తీసుకుంది. వారిలో టాస్క్...
- Advertisement -
- Advertisement -