Viral: ఈ మహిళ టాలెంట్ కు ఎవ్వరైనా ఫిదా.. తన ప్రతిభతో ఏం చేశారంటే?

Viral: మన చుట్టూ ఉన్నవారిలో చాలామంది జీవితంలో ఎన్నో కష్టాలను ఒడిదుడుకులను ఎదుర్కొని చివరికి సక్సెస్ అయ్యారు. కనీసం తినడానికి తిండి లేని వారు కూడా నానా అవస్థలు పడి చదివి నేడు మంచి మంచి స్థాయిలో ఉన్నారు. అటువంటి వారి శోభారాణి కూడా ఒకరు. శోభను ఆమె తల్లిదండ్రులు చదివించే స్తోమత లేకపోవడంతో ఎనిమిదో తరగతిలోనే చదువు మాన్పించి 14 ఏళ్లకే పెళ్లి చేశారు. శోభారాణి భర్తది మహబూబాబాద్‌ జిల్లాలోని బొల్లెపల్లి గ్రామం. ఆమె భర్త వెంకన్న సైకిల్ షాప్‌ నడిపేవారు.

కటిక పేదరికంలో కనీసం తినడానికి తిండి కూడా లేని పరిస్థితులు. అయినా చదువుపై ఇష్టంతో ఇంటి ప‌ని, వంట పని చేసి పదో తరగతి చదివేందుకు స్థానిక ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళింది. కష్టపడి చదివి పదో తరగతి ఫ‌స్ట్ క్లాస్‌లో ఉత్తీర్ణత సాధించింది. బతుకుతెరువు కోసం వరంగల్‌ జిల్లా గీసుకొండ మండలం జాన్‌పాకకు వచ్చింది. ఆ సమయంలో స్వయం సహాయక సంఘాలలో మహిళలు చేరుతుండగా శోభారాణి కూడా అక్కడ చేరి చిన్న మొత్తంలో పొదుపులు చేస్తూ వచ్చింది. అలా హిందీ నేర్చుకొని రిసోర్స్ పర్సన్ గా ప్రస్థానాన్ని ప్రారంభించింది. అలా ఆమె మాట తీరు చూసి అధికారులు ఆమెను ప్రోత్సహించడంతో అలా ఆమె దాదాపు 20 రాష్ట్రాల్లో కొన్ని వేల మందికి పొదుపు పాఠాలు చెప్పింది.

అది గమనించిన అధికారులు ముస్సోరిలో శిక్షణ తీసుకుంటున్న ఐఏఎస్ లకు పొదుపు సంఘాల గురించి చెప్పే అవకాశాన్ని కల్పించడంతో ఆమె మాట తీరును చూసి ఐఏఎస్ లు కూడా ఆమెను అభినందించారు. అయితే ఎన్ని పనులు ఉన్నా కూడా ఆమె ఎప్పుడూ చదవండి నిర్లక్ష్యం చేయలేదు. హలో ఆమె బిఏ, బిజీ కూడా పూర్తి చేసింది. ప్రస్తుతం తన ఇద్దరు కుమారులను బీ టెక్ చదివిస్తోంది. అలా ఆమె శిక్షణలో ట్రైనింగ్ తీసుకున్న వారు ప్రధానమంత్రితో ప్రశంసలు అందుకున్నారు. అలా ఆమె ఎక్కడికి వెళ్లిన కూడా ఆ మహిళ తన మాట తీరుతో ఎంత పెద్ద అధికారులనైనా కూడా మెప్పించగలదు.

 

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -