Pant: రాష్ డ్రైవింగ్ వద్దు.. మూడేళ్ల కిందే పంత్‌ను హెచ్చరించిన ధావన్‌

Pant: టీమిండియా వికెట్ కీపర్, డాషింగ్ బ్యాట్స్ మన్ రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. శుక్రవారం తెల్లవారుజామున ఉత్తరాఖండ్ లోని రూర్కీకి సమీపంలో పంత్ కారు యాక్సిడెంట్ కు గురైంది. ఢిల్లీ నుంచి వస్తున్న పంత్ కారు స్పీడుగా వచ్చి డివైడర్ ను ఢీకొట్టింది. దీంతో కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ వేగంలో కారు దాదాపుగా 200 మీటర్ల దూరం దూసుకెళ్లింది. పంత్ కారు అద్దాలను పగులగొట్టుకుని బయటపడ్డాడు.

 

పంత్ కు తృటిలో ప్రాణాపాయం తప్పింది. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది. గాయాల తీవ్రత ఎక్కువగానే ఉందని.. అయినా అతడు త్వరగా కోలుకుంటాడని ఆశిస్తున్నామని పేర్కొంది. తమ అభిమాన క్రికెటర్ వేగంగా కోలుకోవాలని.. మళ్లీ క్రికెట్ మైదానంలో తన అద్భుతమైన బ్యాటింగ్, కీపింగ్ పెర్ఫార్మెన్స్ తో తమను అలరించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

 

ముందే హెచ్చరించిన సీనియర్!
ఇకపోతే, పంత్ డ్రైవింగ్ పై పలు రకాల కామెంట్లు వస్తున్నాయి. అతడు ర్యాష్ డ్రైవింగ్ చేయడం వల్లే కారు అదుపు తప్పిందని అంటున్నారు. దీంట్లో ఎంత నిజం ఉందనేది పంత్ కే తెలియాలి. ఇదిలాఉంటే.. పంత్ ను డ్రైవింగ్ విషయంలో సహచర క్రికెటర్ శిఖర్ ధవన్ హెచ్చరించారు.

 

డ్రైవింగ్ విషయంలో కాస్త జాగ్రత్త వహించు అని ఆ సమయంలో పంత్ కు ధవన్ సలహా ఇచ్చాడు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజాగా పంత్ కారు ప్రమాదం బారిన పడటంతో ధవన్–పంత్ ల పాత వీడియో మరోసారి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఐపీఎల్ 2019 సమయంలో పంత్, ధవన్ లు ఢిల్లీ క్యాపిటల్స్ కు ఆడిన సంగతి తెలిసిందే. ఏదేమైనా, అపారమైన భవిష్యత్తు ఉన్న ఇలాంటి క్రికెటర్ యాక్సిడెంట్ కు గురవ్వడంపై సాధారణ ప్రజలు కూడా బాధను వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -