Nagarjuna: అక్రమ నిర్మాణాలు ఆపాలంటూ నాగ్‌కు నోటీసులు.. అలా జరగడంతో?

Nagarjuna: టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా హీరోగా, వ్యాఖ్యాతగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అలాగే నిర్మాతగా కూడా రాణిస్తున్నారు. నాగార్జునకు లేడీ ఫ్యాన్ ఫాలొయింగ్ కూడా అధికమే. ఇప్పటివరకు 100కుపైగా సినిమాల్లో నటించారు. ప్రముఖ దర్శకుడు మణిరత్నం డైరెక్షన్‌లో ‘గీతాంజలి’ సినిమా ద్వారా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా మంచి హిట్ అందుకుంది. ఆ తర్వాత హీరోగా నటించిన ‘శివ, అన్నమయ్య, శ్రీరామదాసు’ సినిమాలు ఉత్తమ నటుడిగా గుర్తింపు తెచ్చాయి. ఇటీవల బాలీవుడ్ హీరోహీరోయిన్లు రణబీర్ కపూర్, అలియా భట్ కలిసి నటించిన ‘బ్రహ్మాస్త్ర’ సినిమాలో కీలకపాత్ర పోషించాయి. ఇందులో నాగార్జున యాక్టింగ్‌కు మంచి మార్కులే పడ్డాయి. అలాగే హీరోయిన్ సోనాల్ చౌహాన్‌తో కలిసి యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘ది ఘోస్ట్’ సినిమాలో నటించారు. భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది.

 

 

కెరీర్ పరంగా ఫుల్ బిజీగా ఉండే నాగార్జునకు ఊహించని షాక్ తగిలింది. ఇటీవల ఆయన గోవాలో ఓ నిర్మాణాన్ని చేపట్టారు. ఈ నిర్మాణ పనులను త్వరగా నిలిపివేయాలని స్థానిక అధికారులు ఆదేశాలు జారీ చేశారు. పనులు వెంటనే నిలిపివేయాలని, లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని పంచాయతీ అధికారులు హెచ్చరించారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. గోవాలోని మాండ్రెమ్ గ్రామంలోని అశ్వేవాడలో నాగార్జున ఓ నిర్మాణం చేపడుతున్నారు. అయితే ఈ నిర్మాణ పనులకు అధికారుల అనుమతి తీసుకోలేదని, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ లేవని సమాచారం. దాంతో అక్రమ నిర్మాణ పనుల్ని వెంటనే నిలిపివేయాలని అధికారులు నోటీసులు జారీ చేశారు.

 

 

కాగా, ఇటీవల తెలుగు బిగ్‌బాస్ సీజన్-6 ముగిసింది. ఇప్పటివరకు వరుసగా హోస్ట్ గా వ్యవహరించిన నాగార్జున.. తదుపరి షోకి వ్యాఖ్యాతగా ఉండరని ప్రచారం జరుగుతోంది. నాగార్జున స్థానంలో జూనియర్ ఎన్టీఆర్, రానా దగ్గుబాటి పేర్లు వినిపిస్తున్నాయి. వీరిలో ఎవర్నీ హోస్ట్ గా ఎంపిక చేస్తారనే విషయం తెలియాల్సి ఉంది.

Related Articles

ట్రేండింగ్

Janasena: జనసైనికులను రెచ్చగొట్టే విధంగా వైసీపీ వ్యూహాలు.. ఈ వ్యూహాల వల్ల ఫలితం ఉంటుందా?

Janasena: ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధమవుతుందని తెలుస్తుంది. ఈ క్రమంలోనే అన్ని పార్టీ నేతలు కూడా అభ్యర్థులను ప్రకటించే ప్రక్రియ పూర్తి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తెలుగుదేశం జనసేన కూటమి...
- Advertisement -
- Advertisement -