TDP: వచ్చే ఎన్నికలు టీడీపీకి కీలకంగా మారాయి. గత ఎన్నికల్లో ఘోర ఓటమిని చవిచూసిన టీడీపీ ఈ సారి ఎలాగైనా గెలిచేందుకు వ్యూహలు రచిస్తోంది. ఇప్పటినుంచే ఎన్నికలకు సిద్దమవుతోంది. గతం కంటే భిన్నంగా ఈ సారి అభ్యర్థులను చంద్రబాబు ముందే ఫిక్స్ చేస్తున్నారు. ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యేలందరినీ టికెట్లు ఇస్తానంటూ చంద్రబాబు అధికారికంగా ప్రకటించారు. అలాగే నేతలను పిలిపించుకుని వ్యక్తిగతంగా భేటీ అవుతున్నారు. సర్వేల నివేదికల ద్వారా గెలుపొందే అభ్యర్థులకు ముందే టికెట్లు ఫిక్స్ చేస్తున్నారు. ఇక మిగతా నేతలు కూడా పనితీరు మార్చుకోవాలని, ప్రజల్లో తిరగాలని చూపిస్తన్నారు. గెలుపు గుర్రాలకే టికెట్లు ఇస్తామంటూ తెలిపారు. ఇంట్లో కూర్చుని ఎన్నికల సమయంలో వస్తే టికెట్లు ఇచ్చేది లేదని చెప్పారు.
ఇక టీడీపీ గెలుపు కోసం ఎన్ఆర్ఐలు కూడా రంగంలోకి దిగారు. రాష్ట్రం నుంచి వెళ్లి విదేశాల్లో స్థిరపడి అక్కడ చాలామంది వ్యాపారాలు, ఉద్యోగాలు చేస్తోన్నారు. కొంతమంది చదువు కోసం వెళ్లి అక్కడే ఉన్నారు. అలాంటి వారిలో టీడీపీ సానుభూతి పరులు చాలామంది ఉన్నారు. రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చేందుకు వారు అక్కడ నుంచే ప్రస్తుతం ప్రయత్నాలు చేస్తోన్నారు. టీడీపీకి ఆర్ధికంగా సాయం చేయడంతో పాటు తమ ప్రాంతాల్లోని ప్రజలను టీడీపీ వైపు మళ్లేలా ప్రచారం చేస్తోన్నారు. అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్, స్విట్జర్లాండ్,సింగపూర్, మలేసియా దేశాల్లో రాష్ట్రానికి చెందినవారు ఎక్కువమంది స్థిరపడ్డారు. అక్కడ వ్యాపారాలు, ఉద్యోగాలు చేస్తూ ఆర్ధికంగా బలపడ్డారు.
వచ్చే ఎన్నికల్లో టీడీపీకి కీలకంగా మారడంతో ఇప్పటినుంచే ఎన్ఆర్ఐలు రంగంలోకి దిగారు. టీడీపీకి ఎన్నికలలో ఆర్ధికంగా అండగా నిలవడంతో పాటు పార్టీకి భారీగా ఫండింగ్ రూపంలో ఇస్తున్నారు. ప్రస్తుతం ఫోన్ లలో టచ్ లో ఉంటూ తమ ప్రాంతంలోని ఓటర్లను టీడీపీ వైపు మళ్లించేందుకు ప్రయత్నాలు చేస్తోన్నారు. ఎన్నికల నాటికి రాష్ట్రానికి వచ్చి ప్రచారం నిర్వహిస్తామని చెబుతునన్నారు. ఇప్పటికే విదేశాల్లో మినీ మహానాడు, ఎన్టీఆర్ జయంతి, వర్దంతి కార్యక్రమాలు నిర్వహిస్తూ పార్టీ సానుభూతిపరులందరినీ ఏకం చేస్తున్నారు. టీడీపీ ఎన్ఆర్ఐ టీమ్ విదేశాల్లో స్థిరపడిన టీడీపీ కార్యకర్తలను ఏకం చేస్తుంది. భారీ ఎత్తున విరాళాలు పొగు చేయడంతో పాటు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు డబ్బులు ఖర్చు పెట్టేలా ప్లాన్ చేస్తున్నారు.
ఇటీవల చాలామంది టీడీపీ నేతలు విదేశాలకు వెళ్లి వచ్చారు. విదేశాల్లో టీడీపీ కార్యకర్తలు నిర్వహిస్తున్న మినీ మహానాడు కార్యక్రమాల్లో పాల్గొనడానికి వెళ్లామని చెబుతున్నప్పటికీ.. దీని వెనుక తతంగం వెరేది ఉందని తెలుస్తోంది. విదేశాల్లోని పార్టీ సానుభూతిపరులను ఏకం చేయడంతో పాటు పార్టీకి ఫండ్ రైజ్ చేస్తున్నారని సమాచారం. 2014,2019 ఎన్నికల్లోనూ టీడీపీ తరపున ఎన్ఆర్ఐలు కీలక పాత్ర పోషించారు. విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చి ప్రచారం నిర్వహించారు. సోషల్ మీడియాతో పాటు ప్రజాక్షేత్రంలోకి దిగి ప్రచారం చేశారు. పార్టీకి డబ్బులు కూడా భారీగా ఖర్చు పెట్టారు. అయితే ఈ సారి ఎన్నికలు టీడీపీకి చావో రేవో అన్నట్లు మారాయి. దీంతో ఈ సారి ఎన్నికల్లో టీడీపీ కోసం ఆరు నెలల ముందుగానే రాష్ట్రానికి వచ్చి ప్రచారం చేయాలని నిర్ణయించుకుననారు. టీడీపీ గెలుపు కోసం తమవంతు ప్రయత్నాలు చేయనున్నారు.