NTR 30-Aparichitudu: ఎన్టీఆర్ 30 విక్రమ్ అపరిచితుడికి సంబంధం ఉందా.. అయోమయంలో ఫ్యాన్స్?

NTR 30-Aparichitudu: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొట్టిన జూనియర్ ఎన్టీఆర్ ఇటీవల రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ సినిమాలో కొమురం భీం పాత్రలో నటించి పాన్ ఇండియా హీరోగా మంచి గుర్తింపు పొందాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్ నటనకు సినీ విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ని అకౌంట్లో వేసుకున్న ఎన్టీఆర్ తన తదుపరి సినిమా కూడా పాన్ ఇండియా రేంజ్ లో ఉండేలా ప్లాన్ చేస్తున్నాడు.

ఈ క్రమంలో జనతా గ్యారేజ్ సినిమా ద్వారా హిట్ ఇచ్చిన కొరటాల శివ దర్శకత్వంలో తన తదుపరి సినిమా చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించాడు. అంతేకాకుండా ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాకు సంబంధించి రిలీజ్ అయిన గ్లింప్స్ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంది. దీంతో ఈ సినిమా మీద ఎన్టీఆర్ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

ఇటీవల కొరటాల శివ దర్శకత్వం వహించిన ఆచార్య సినిమా డిజాస్టర్ కావడంతో ఎన్టీఆర్ తన సినిమా గురించి మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కొరటాల కథను మార్చి గరుడ పురాణం ఆధారంగా కథ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ గరుడ పురాణం పేరు వినగానే శంకర్ విక్రమ్ కాంబినేషన్లో వచ్చిన అపరిచితుడు సినిమా గుర్తుకు వస్తోంది.

మానవులు చేసే పాప పుణ్యాల ఆధారంగా మరణించిన తర్వాత యమలోకంలో గరుడ పురాణంలో సూచించిన విధంగా శిక్షలు అమలు చేస్తారు. ఇలా ఎన్టీఆర్ కోసం కొరటాల శివ సిద్ధం చేసిన కథ గరుడ పురాణం చుట్టూ తిరుగుతుందని.. ఇందులో ఎన్టీఆర్ వాటి రహస్యాలను చేరిపేస్తాడని ఇండస్ట్రీ వర్గాల నుండి సమాచారం. మరి ఎన్టీఆర్ కొరటాల సినిమా గురించి వస్తున్నటువంటి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ఈ సినిమా గురించి ఎన్నో కథనాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

YCP-TDP: చంద్రబాబు అరెస్ట్ తో రగిలిపోతున్న టీడీపీ.. అరెస్ట్ పై వైసీపీ రియాక్షన్ ఏంటంటే?

YCP-TDP:  చంద్రబాబు నాయుడుని ఆధారాలు లేని కేసులో అరెస్టు చేసి జైల్లో పెట్టిన జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఏం చేస్తున్నాడు అంటే చంద్రబాబు నాయుడుని జైల్లో పెట్టిన సందర్భంగా పండగ చేసుకుంటూ బాగా...
- Advertisement -
- Advertisement -