NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రతిభ గురించి ఈ మాటలు విన్నారా?

NTR: జూనియర్ ఎన్టీఆర్ అంటే చాలా మందికి ఇష్టం. ఇప్పుడున్న హీరోల్లో అద్బుతమైన డైలాగ్ డెలివరీ, నటన, ఎక్స్ ప్రెషన్స్ ఇవ్వగల నటుల్లో ఎన్టీఆర్ ముందుంటారు. ఆయన మాట్లాడే మాట తీరు కూడా చాలా గొప్పగా ఉంటుంది. అందుకే ఆయన్ని ఎక్కువ మంది అభిమానిస్తారు. ఎన్టీఆర్ ని ఆదర్శంగా తీసుకునేవారు కూడా చాలా మంది ఉన్నారు. అలాంటి వారిలో బిగ్ బాస్ కంటెస్టెంట్ మానస్ కూడా ఉన్నారు.

 

మానస్ బిగ్ బాస్ షో ద్వారా పాపులర్ అయ్యారు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో జూనియర్ ఎన్టీఆర్ గురించి, ఆయన గొప్పతనం గురించి మాట్లాడారు. అప్పట్లో జూనియర్ ఎన్టీఆర్ ఓ ప్రమాదానికి గురయ్యారు. ఆ ప్రమాదంతో ఎన్టీఆర్ పరిస్థితి ఇక అంతే అని అందరూ అనుకున్నారు. అయితే ఆ సమయంలో కూడా ఎన్టీఆర్ నెటిగివ్ గా తీసుకోకుండా ముందుకు సాగారని మానస్ చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ ఇక సినీ రంగంలో రాణించలేడని అనుకున్న సమయంలో ఆ సందేహాలన్నింటిని చెరిపేస్తూ ఆయన పాజిటివ్ వైబ్ తో ముందుకు సాగారని తెలిపారు.

 

ఎన్టీఆర్ కు ప్రమాదం జరిగిన సమయంలో ఆయనపై అనేక వార్తలు కలకలం రేపాయని మానస్ తెలిపారు. తారక్ కు తక్కువ చేస్తూ వార్తలు రావడంతో అందరూ ఎన్టీఆర్ వైపు చూడటం మానేశారని, అయితే వాటన్నింటినీ చెరిపేస్తూ తారక్ తన డ్యాన్స్ తో ఆకట్టుకున్నాడని తెలిపారు. అంత పెద్ద ప్రమాదం నుంచి తారక్ బయటికొచ్చి మళ్లీ అందరికీ పోటీనిచ్చారని అన్నారు. తన సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేసి సక్సెస్ సాధించారని, అందుకే ఆయన అందరికీ స్పూర్తి అని కొనియాడారు.

 

ఎన్టీఆర్ లాంటి బెస్ట్ డ్యాన్సర్, బెస్ట్ పెర్ఫామర్ ఎవరూ లేరని మానస్ ప్రశంసించారు. తెలుగులో అవలీలగా మాట్లాడే సత్తా కొద్ది మంది హీరోలకే ఉంటుందని, అందులో ఎన్టీఆర్ ముందు వరుసలో ఉంటారని మానస్ వెల్లడించారు. ప్రస్తుతం మానస్ చేసిన కామెంట్స్ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. మానస్ కామెంట్స్ ఇప్పుడు అందరిలో ఉత్తేజాన్ని రేపుతున్నాయి. సోషల్ మీడియాలో మానస్ ఎన్టీఆర్ పై చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Rayalaseema: చంద్రబాబు ఎంట్రీతో సీమలో పరిస్థితి మారుతోందా.. ఆ స్థానాల్లో టీడీపీనే గెలుస్తోందా?

Rayalaseema: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజాగళం అని పేరిట యాత్రను ప్రారంభించిన సంగతి మనకు తెలిసిందే. నిన్న పలమనేరులో ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమం ఎంతో విజయవంతం అయింది ఇకపోతే ఈ...
- Advertisement -
- Advertisement -