NTR: కొరటాల తారక్ విశ్వరూపం చూపించబోతున్నారా?

NTR: తెలుగు ప్రేక్షకులను తన నటన, డ్యాన్స్, కామెడీతో అలరించే నటుల జాబితాలో నందమూరి నట వారసుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒకడు. నందమూరి నట వారసత్వాన్ని కొనసాగిస్తూ సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తారక్.. అంచలంచలుగా ఎదిగి ప్రస్తుతం టాప్ హీరోల జాబితాలో చేరాడు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో ప్యాన్ ఇండియా స్టార్ గా మారిన ఎన్టీఆర్.. ప్రస్తుతం తన ప్రాజెక్టుల మీద పూర్తి దృష్టిని సారించాడు.

‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో భీంగా అలరించిన తారక్.. తర్వాతి సినిమాను డైరెక్టర్ కొరటాల శివతో చేస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన వివరాల ప్రకారం ఇందులో తారక్ పూర్తి మాస్ లుక్ లో, వైలెంట్ గా కనిపించబోతున్నాడని సమాచారం. ఎన్టీఆర్ లెవల్ ను పెంచేలా ఈ సినిమా కథ, ఫైట్స్ ఉంటాయని ఇండస్ట్రీలో ఇప్పటికే టాక్ నడుస్తుండగా.. తాజాగా మరో లీక్ సినిమా మీద అంచనాలను పెంచేసింది.

తన నటనతో అందరినీ ఆశ్చర్యపరిచే తారక్ ను కొరటాల శివ పూర్తి స్థాయిలో వాడుకోబోతున్నాడనే సమాచారం అందుతోంది. దాని ప్రకారం ఈ సినిమాలో ఎన్టీఆర్ ను ఏకంగా నాలుగు పాత్రల్లో చూపించబోతున్నాడని తెలుస్తోంది. నాలుగు డిఫరెంట్ క్యారెక్టర్లతో తారక్ ను చూపించి.. ఫ్యాన్స్ కు వేరే లెవల్ పండగను కొరటాల శివ తేబోతున్నట్లు సమాచారం. కాగా విలన్, హీరో పాత్రల నిడివి ఎక్కువగా ఉంటే.. మిగిలిన రెండు క్యారెక్టర్ల నిడివి తక్కువగా ఉండబోతోందని బొగట్టా.

యంగ్ జనరేషన్ హీరోల్లో ఒకే సినిమాలో మూడు పాత్రలు చేసిన హీరోగా జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటికే రికార్డుకెక్కగా.. ఒకవేళ నాలుగు పాత్రల్లో కనిపిస్తే మాత్రం అది అరుదైన రికార్డుగా మారుతుంది. ‘లవకుశ’ సినిమాలో ముగ్గురు అన్నదమ్ముల పాత్రలో ఎన్టీఆర్ ఆకట్టుకోగా.. అందులో ‘రావణ’ క్యారెక్టర్ జనాలను బాగా ఆకట్టుకోవడం తెలిసిందే. ఇక కొరటాల శివ సినిమాలో కూడా విలన్ గా ఎన్టీఆర్ వేరే లెవల్ యాక్టింగ్ తో అలరిస్తాడని ఫ్యాన్స్ ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: సింహం సింగిల్ కాదు అది రేబిస్ సోకిన కుక్క.. పవన్ సంచలన వ్యఖ్యలు వైరల్!

Pawan Kalyan:  ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చిరంజీవిని విమర్శించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ విషయంపై జనసేన పార్టీ అధినేత, చిరంజీవి చిన్న తమ్ముడు అయిన పవన్ కళ్యాణ్ తీవ్రంగా...
- Advertisement -
- Advertisement -