NTR: ఎన్టీఆర్ లావు కావడానికి ఆ అమ్మాయి కారణమా?

NTR: టాలీవుడ్‌లో స్టార్ హీరోగా కొనసాగుతున్నారు జూనియర్ ఎన్టీఆర్. తాతకు తగ్గ మనవడిగా ఇండస్ట్రీలో రాణిస్తూ.. తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు. స్టార్ హీరోలున్న నందమూరి ఫ్యామిలీ అయినా.. సొంత ట్యాలెంట్‌ను ప్రూవ్ చేసుకుని ఇండస్ట్రీలో ఎదిగాడు. అయితే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మొదట్లో ఎన్టీఆర్ చాలా లావుగా ఉండేవాడని తెలిసిన విషయమే. 2001లో ‘నిన్ను చూడాలని’ సినిమాతో ఎన్టీఆర్ టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ‘స్టూడెంట్ నం.1’ సినిమాలో నటించాడు. ఈ సినిమా ద్వారా మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ఈ మూవీ తర్వాత ‘ఆది’, అల్లరి రాముడు, సింహాద్రి’ సినిమాలు చేశాడు. సింహాద్రి సినిమా తర్వాత ఎన్టీఆర్ బాగా లావయ్యాడు. దీంతో ఎన్టీఆర్‌పై పలు విమర్శలు వెల్లువెత్తాయి. ‘ఆంధ్రావాలా, సాంబ, నా అల్లుడు, నరసింహుడు, అశోక్, రాఖీ’ సినిమాలు పెద్దగా ఆడలేదు.

 

 

ఆ తర్వాత ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ‘యమదొంగ’ సినిమా చేశాడు. అయితే జక్కన్న ఎన్టీఆర్‌ను బరువు తగ్గమని సలహా ఇచ్చాడు. దాంతో ఎన్టీఆర్ లైఫో ఆపరేషన్ చేయించుకుని సన్నబడ్డాడు. అప్పటి నుంచి సన్నగానే కనిపిస్తున్నాడు. అయితే ఎన్టీఆర్ లావు అవ్వడానికి కారణం ఎంటో.. ఎవరి వల్ల తాను లావయ్యాడో తెలియజేశాడు. ఎన్టీఆర్‌కు ఫైట్ మాస్టర్ విజయ్ మొదటి నుంచి తెలుసు. విజయ్ కొడుకు హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌కు ఎన్టీఆర్ గెస్టుగా వచ్చాడు.

 

 

ఈ ఈవెంట్‌లో ఎన్టీఆర్ తాను లావు అవ్వడానికి గల కారణాన్ని తెలియజేశాడు. ఎన్టీఆర్ లావు అవ్వడానికి ఫైట్ మాస్టర్ విజయ్ భార్య అని చెప్పుకొచ్చాడు. విజయ్ భార్య పెట్టిన వంటకాలు తినే తాను లావు అయ్యానని ఎన్టీఆర్ తెలిపాడు. అయితే ఎన్టీఆర్ నటించిన అన్ని సినిమాలకు విజయ్ ఫైట్ మాస్టర్‌గా చేశాడు. షూటింగ్ సమయంలో విజయ్ భార్య ఎన్టీఆర్ కోసం స్పెషల్ వంటకాలు చేసేదట. ఏకంగా 200లకుపైగా వంటలు చేసి పంపించేదట. అవి తినే ఎన్టీఆర్ లావైనట్లు తెలిపాడు. విజయ్ భార్య ఎంతో టేస్టీగా వంటలు వండేదని, అందుకే విడిచిపెట్టకుండా తినేవాడినని పేర్కొన్నాడు.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -