NTR: ఆ సమయంలో తారక్ పొలిటికల్ ఎంట్రీ ఇస్తారా?

NTR: జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశంపై ఎప్పటినుంచో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. అంతకుముందు ఒకసారి టీడీపీ తరఫున ఎన్టీఆర్ ప్రచారాల్లో పాల్గొన్నారు. కానీ అనుకోని అవాంతరాల వల్ల సగం లోని విరమించుకున్నారు.2019 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా టీడీపీ ఘోర పరాజయాన్ని తట్టుకోలేని అభిమానులు జూనియర్ ఎన్టీఆర్ టీడీపీతరఫున బాధ్యతలు స్వీకరించాలి అని డిమాండ్ కూడా చేశారు. ఎంతోమంది టీడీపీ నేతలు కూడా ఆ డిమాండ్ ను బలపరిచారు. అప్పటినుంచి ఎప్పుడు టీడీపీకష్టాలు ఎదుర్కొన్న ఈ వాదన తెరపైకి రావడం ఆనవాయితీగా మారింది.

 

ఈ నేపథ్యంలో ఇటీవల ఈ డిమాండ్ మరింత బలపడింది. టీడీపీతరఫున ఎన్టీఆర్ ను తీసుకురావాలి అనే వారి సంఖ్య క్రమంగా పెరుగుతుంది. ఇప్పుడు రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల రిత్యా లోకేష్ పై ఆధారపడడం కంటే కూడా జూనియర్ ఎన్టీఆర్ ను పార్టీలోకి తీసుకురావడం ఉచితమని పార్టీలో చాలామంది భావిస్తున్నట్లు తెలుస్తుంది. వైసీపీకి సరియైన సమాధానం ఇవ్వగలిగే సత్తా జూనియర్ ఎన్టీఆర్ కి ఉందని భావన టీడీపీ నేతలలో ఉంది. కానీ ఆ విషయాన్ని నేరుగా పార్టీ అధినేతకు చెప్పలేక చాలామంది ఇబ్బంది పడుతున్నారట.

 

స్వయంగా చంద్రబాబు నాయుడు టూర్ లోనే కార్యకర్తలు తమ డిమాండ్ను వినిపించారు అంటే జూనియర్ ఎన్టీఆర్ టిడిపిలో రావాలి అన్న అభిమానుల కాంక్ష ఎంత దృఢంగా ఉందో అర్థం చేసుకోండి. ఇంచుమించు చంద్రబాబు నాయుడు పర్యటనకు వెళ్ళిన ప్రతి జిల్లాలో ఇలాంటి అనుభవమే ఎదురయింది. అంతెందుకు చంద్రబాబు నాయుడు సొంత జిల్లా అయిన కుప్పం పర్యటనలో ఉండగా, ‘జై ఎన్టీఆర్’అని కొందరు అభిమానులు డిమాండ్ చేశారు. జరుగుతున్న సంఘటనను దృష్టిలో పెట్టుకొని జూనియర్ ఎన్టీఆర్ త్వరలో పార్టీలోకి ఎంటర్ అవుతారు అని పలు వర్గాలు భావిస్తున్నాయి.

 

కానీ ఇంకా టీడీపీ అధిష్టానం నుంచి ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం పై ఎటువంటి స్పష్టత లేదు. ఒకవైపు చంద్రబాబు, నారా లోకేష్ మరియు బాలకృష్ణ ముగ్గురు ఎక్కడ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన రాకుండా జాగ్రత్త పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈసారి రాబోయే ఎలక్షన్స్ కి ఎన్టీఆర్ రాజకీయ రంగప్రవేశం కన్ఫామ్ అని, చంద్రబాబు నాయుడు అడ్డుపడితే సొంత పార్టీ స్థాపించి అయినా రాజకీయాల్లోకి వచ్చేది ఖాయమని ప్రచారం జరుగుతోంది.

 

అయితే ఈ విషయంపై జూనియర్ ఎన్టీఆర్ మాట భిన్నంగా ఉంది. రాజకీయ ప్రవేశం ఎప్పుడు అన్న మీడియా ప్రశ్నకు ఆయన ‘ఈ విషయం గురించి మాట్లాడడానికి ఇది సరైన సమయం కాదని. కచ్చితంగా ఒక రోజు కాఫీ తాగుతూ తీరికగా రాజకీయాలపై మనమే సరదాగా కబుర్లు చెప్పుకుందాం’అని నవ్వుతూ సమాధానం ఇచ్చారు. దాంతో ఎన్టీఆర్ చెప్పకనే తన ఉద్దేశాన్ని చెప్పాడు అంటూ అభిమానులు రెచ్చిపోతున్నారు. 2029 జరగబోతున్న ఎన్నికల్లో టీడీపీ తరఫున ఎన్టీఆర్ బరిలోకి దిగే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం.

Related Articles

ట్రేండింగ్

Rayalaseema: చంద్రబాబు ఎంట్రీతో సీమలో పరిస్థితి మారుతోందా.. ఆ స్థానాల్లో టీడీపీనే గెలుస్తోందా?

Rayalaseema: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజాగళం అని పేరిట యాత్రను ప్రారంభించిన సంగతి మనకు తెలిసిందే. నిన్న పలమనేరులో ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమం ఎంతో విజయవంతం అయింది ఇకపోతే ఈ...
- Advertisement -
- Advertisement -