NTR-Krishna: కృష్ణకు మాత్రమే సొంతమైన ఈ రికార్డులు తెలుసా?

NTR-Krishna: టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సూపర్ స్టార్ కృష్ణ ఉన్నన్ని రోజులు మంచి గుర్తింపుతో పాటు మంచి హోదా సొంతం చేసుకున్నారు. వ్యక్తిగతంగా మాత్రం మర్చిపోలేని గుర్తింపును అందుకున్నారు. నటుడుగా ఎన్నో సినిమాలలో నటించి సూపర్ స్టార్ గా నిలిచారు. కెరీర్ మొదట్లోనే ఏడాదికి 10 కంటే ఎక్కువ సినిమాలు చేసిన రోజులు కూడా ఉన్నాయి.

 

నటుడుగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న కృష్ణ ఎంతోమంది తెలుగు ప్రేక్షకులను అభిమానులుగా కూడా మార్చుకున్నారు. ఇక ఈయన రెండు రోజుల కిందట ఈ లోకాన్ని విడిచిపెట్టిన సంగతి తెలిసిందే. గత కొన్ని రోజుల నుండి అనారోగ్య సమస్యతో బాధపడుతున్న కృష్ణ ఇటీవలే మరణించగా ఆయన కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు తట్టుకోలేకపోతున్నారు.

 

ఇక ఈ సందర్భంగా ఈయన గురించి ఎన్నో విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తను సొంతం చేసుకున్న గుర్తింపులు, తను సంపాదించుకున్న పేర్లు, హోదాల గురించి తెగ వార్తలు వస్తున్నాయి. అయితే సినీ ఇండస్ట్రీలో ఎన్టీఆర్ కి సాధ్యం కానిది కృష్ణ చేసి చూపించారని తెలుస్తుంది. ఇటీవలే ఓ సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని కృష్ణ సినీ జీవితం గురించి తెలిపాడు.

 

కృష్ణ సినిమాలలో ఎవరు తెచ్చుకొని గుర్తింపును సొంతం చేసుకున్నారు.. సినిమాల పరంగా ఎన్నో రికార్డులు సొంతం చేసుకున్నాడు అంటూ తెలిపాడు. అంతేకాకుండా ఎన్టీఆర్ కి సాధ్యం కానిది ఆయన చేసి చూపించాడు అంటూ.. అదేంటంటే కెరీర్ మొదట్లోనే ఆయన మల్టీ స్టారర్ సినిమాల్లో చేశాడు అని.. అలా చాలావరకు చాలామంది స్టార్ హీరోలతో చేశాడని తెలిపాడు. అంతేకాకుండా తను నటించిన మల్టీస్టారర్ మూవీ ఒకే రోజు థియేటర్లో కూడా విడుదల అయిందని.. నిజానికి ఇటువంటి అరుదైన గుర్తింపు ఎవరికి రాలేదు అని అన్నాడు. ఇక ఆయన కృష్ణ గురించి చెప్పిన విషయాలు ప్రస్తుతం బాగా వైరల్ అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu: వారికి 500 యూనిట్ల వ‌ర‌కు విద్యుత్‌.. చంద్రబాబు హామీతో ఆ వర్గం ఓట్లు టీడీపీకే వస్తాయా?

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు అన్ని వర్గాల ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని వరాల జల్లు కురిపిస్తున్నారు. నిరుద్యోగులు, రైతులు, మహిళలు, చేనేత కార్మికులు ఇలా.. ఒక్కొక్కరికి ఏం కావాలి? వాళ్లకి ఎలాంటి...
- Advertisement -
- Advertisement -