NTR Nagar: స్కూల్లో టీచర్ వీడియో తీసిన విద్యార్థులు.. చివరికి?

NTR Nagar: మధ్యకాలంలో చాలా మంది విద్యార్థులు క్రమశిక్షణ లేకపోవడంతో చెడు అలవాట్లకు బానిసలుగా మారడంతో పాటుగా తోటి విద్యార్థులను కూడా చెడగొడుతున్నారు. చదువుకుంటూ మంచి విద్యాబుద్ధులు నేర్చుకోవాల్సిన స్టూడెంట్స్ టీచర్స్ పై కామెంట్స్ చేయడం టీచర్లతో అసభ్యంగా ప్రవర్తించడం లాంటివి చేస్తున్నారు. విద్యార్థులకు భయం పెట్టకపోవడంతో వారు మరింత రెచ్చిపోతున్నారు. తాజాగా గూడా ఇలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. తాజాగా ఎన్టీఆర్ జిల్లాలో టీచర్ పాఠాలు చెబుతున్న సమయంలో ఓ విద్యార్థి వీడియో తీసి, అసభ్యకరమైన మ్యూజిక్ యాడ్ చేసి సంబంధించిన వీడియోని మీడియాలో షేర్ చేశాడు.

 

ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలంలోని ఒక హై స్కూల్ లో విద్యార్థుల రెచ్చిపోయి ఉపాధ్యాయుల పట్ల దారుణంగా ప్రవర్తిస్తున్నారు. అయితే ఒక లేడీ టీచర్ బోర్డు వైపు తిరిగి పాఠాలు చెబుతున్న సమయంలో ఆమెను వెనుక నుంచి వీడియో తీశారు. ఆ క్లిప్ కు ఆశ్లీల పాట యాడ్ చేసి, ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు ఓ స్టూడెంట్. ఆ వీడియోను అప్పటికే చాలా మంది చూశారు. అయితే విషయం ఊరంతా తెలిసింది. విషయం తెలుసుకున్న టీచర్ హెచ్ఎం దృష్టికి తీసుకెళ్లారు. ఆ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న ఆ స్కూల్ హెచ్ఎం సదరు విద్యార్థిని పేరెంట్స్ ను స్కూల్ కి పిలిపించారు.

 

వారి కుమారుడు చేసిన బాగోతాన్ని వివరించి ఇక్కడ చదవడానికి వీల్లేదని, టీసీ తీసుకుని వెళ్లిపోవాలని ఘాటుగా వార్నింగ్ ఇచ్చాడు. తమ కుమారుడు చేసిన పని పట్ల పేరెంట్స్ తలదించుకున్నారు. ఈ ఒక్కసారికి మన్నించాలని వేడుకున్నారు. దాంతో బాధిత ఉపాధ్యాయురాలు, హెచ్ఎం ఇంకో సారి ఇలా జరగకుండా చూసుకోమని తెలిపింది.

Related Articles

ట్రేండింగ్

Botsa Satyanarayana: కూటమికి ఓటేస్తే స్టీల్‌ప్లాంట్‌ని రక్షించలేమట.. అధికారంలో ఉండి ఏం చేశారు బొత్స గారు?

Botsa Satyanarayana: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వైసిపి నేతలందరూ కూడా పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను మొదలు పెడుతున్నారు. అయితే చాలా చోట్ల వీరికి పూర్తి స్థాయిలో వ్యతిరేకత ఏర్పడుతుందని తెలుస్తుంది. ఈ...
- Advertisement -
- Advertisement -