NTR: కొడాలి నానితో మాట్లాడని తారక్.. కారణమేంటంటే?

NTR: నందమూరి వారసుడు జూనియర్ ఎన్టీఆర్ స్నేహానికి ఎంత విలువ ఇస్తాడో అందరికీ తెలిసిందే. ఎప్పుడో కలిసిన రాజీవ్ కనకాలతో ఇప్పటికీ స్నేహం చేస్తున్నారు తారక్. ఎన్టీఆర్ కి మాజీ మంత్రి కొడాలి నానితో కూడా మంచి సాన్నిహిత్యం ఉండేది. ఒక సందర్భంలో నాని తారక్ ని పెద్ద ఎన్టీఆర్ కంటే గొప్ప నటుడు అని ఇంటర్వ్యూ లో చెప్పి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసాడు. వీరి మధ్య స్నేహం చాలా కాలం సాగింది. కానీ రాజకీయాలు వీరి మధ్య చిచ్చు పెట్టాయని అందరూ అంటారు.

 

కొడాలి నానితో ఎన్టీఆర్ మాట్లాడకపోవడానికి కారణాలు ఇవేనా..

ఎన్టీఆర్-కొడాలి నాని మధ్య సంబంధాలు తెగిపోవడానికి కొన్ని కారణాలు తెలిపారు దర్శకులు వీవీ వినాయక్. వినాయక్ తారక్ కి తొలి మాస్ హిట్ ఇచ్చిన దర్శకుడు. ఎన్టీఆర్ కెరీర్ లో స్పెషల్ ఫిలిం అదుర్స్ కి కూడా ఈయనే దర్శకుడు. తారక్ అలాగే కొడాలి నానితో కూడా మంచి సంబంధాలు కలిగి ఉన్నారు వినాయక్. ఈ విషయం మీద ఈ దర్శకుడు ఏం అన్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

 

సుమన్ టీవీ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వినాయక్ చెప్పిన మాటలు ఏంటంటే. అప్పటివరకూ కొడాలి నాని-తారక్ మధ్య అంతా సవ్యంగానే ఉండేది. కానీ రాజకీయ కారణాల వల్ల వాళ్ళు విడిపోవాల్సి వచ్చింది. అప్పటివరకూ టీడీపీ లో ఉన్న కొడాలి నాని వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకోవడంతో తారక్-నాని స్నేహం మీద అది ప్రభావం చూపించింది.

 

 

కొడాలి నాని వైసీపీలో చేరడంతో ఎన్టీఆర్-నాని స్నేహం పోయిందని తను అనుకుంటున్నట్టు వినాయక్ చెప్పారు. అన్నీ కుదిరితే తారక్-కొడాలి నాని కాంబినేషన్ లో ఒక సినిమా వచ్చే అవకాశం ఉండవచ్చు అని సంచలన వ్యాఖ్యలు చేశారు ఆది దర్శకుడు. ఒకవేళ గనక ఇది జరిగితే తారక్ అభిమానులకి ఇక పండగే అని చెప్పాలి.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: పార్టీ నిర్వహణ అవసరాల కోసం 10 కోట్ల రూపాయలు ప్రకటించిన పవన్.. గ్రేట్ కదా!

Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ స్థాపించినప్పటి నుంచి పార్టీ అవసరాల కోసం పెద్ద ఎత్తున తన సొంత డబ్బును ఖర్చు చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. సాధారణంగా ఎవరైనా...
- Advertisement -
- Advertisement -