NTR Saipallavi: ఎన్టీఆర్ సాయిపల్లవి కాంబినేషన్ ఫిక్స్.. అంతకు మించి?

NTR Saipallavi: ఆర్ఆర్ఆర్ ఘన విజయం తరువాత ఎన్టీఆర్ నటిస్తున్న 30వ చిత్రం కొరటాల దర్శకత్వంలో శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటుంది. రామోజీ ఫిలిం సిటీ లో విలన్ సైఫాలీ ఖాన్ హీరో ఎన్టీఆర్ ల మధ్య భారీ యాక్షన్స్ ని చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాలో కొంత భాగం మైథాలజికల్ స్టోరీ ఉంటుందని సమాచారం.

ఇందులో ఎన్టీఆర్ లుక్ కూడా డిఫరెంట్ గా ఉండబోతుందంట. అందుకోసం డిఫరెంట్ మేకోవర్ ట్రై చేస్తున్నాడు ఎన్టీఆర్. ఆచార్య పరాజయాన్ని మూటకట్టుకోవటంతో మరింత కసితో కొరటాల శివ కూడా ఈ సినిమా కోసం బాగా కసరత్తులు చేస్తున్నాడు. ఈ సినిమాలో అందాల తార శ్రీదేవి ముద్దుల కుమార్తె జాన్వీ కపూర్ హీరోయిన్ గా ఎంపికైంది.

 

ఆల్రెడీ ఆమె కూడా షూటింగ్లో పాల్గొంటుంది. అయితే తాజాగా ఇందులో సెకండ్ హీరోయిన్ గా సాయి పల్లవి నటిస్తుందనే వార్తలు చక్కెర్లు కొడుతున్నాయి. లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి గతంలో కూడా ఎన్టీఆర్ సరసన నటిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 లో అయితే సాయి పల్లవి ఏకంగా షూటింగ్లో కూడా జాయిన్ అయిందని పుకార్లు వచ్చాయి.

 

అలాంటిదేమీ లేదని సోషల్ మీడియాలో ఆమె స్వయంగా చెప్పుకుంటేనే గాని ఎవరూ నమ్మలేదు. ఇప్పుడు ఎన్టీఆర్ 30లో కూడా సాయి పల్లవి నిజంగానే నటిస్తుందో లేదో అని తలలు బద్దలు కొట్టుకుంటున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. ఎందుకంటే ఎన్టీఆర్ తో డాన్స్ చేయటానికి సరైన కాంబినేషన్. సాయి పల్లవి, ఎన్టీఆర్ ఇద్దరూ వెండితెర మీద డాన్స్ చేస్తే ఫ్యాన్స్ షాక్ అవ్వాల్సిందే.

 

కొరటాల ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చిన జనతా గ్యారేజ్ మంచి హిట్ ని ఎందుకు అవటంతో ఈ సినిమా మీద కూడా భారీగా అంచనాలు పెంచుకుంటున్నారు ప్రేక్షకులు. కొరటాల శివ మరింత కసితో, యాక్షన్ ఎంటర్టైన్ గా తెరకెక్కిస్తున్నాడు.అఫీషియల్ గా సినిమా వాళ్ళు అనౌన్స్ చేస్తే తప్ప సినిమాలో సాయి పల్లవి ఉన్నదీ, లేనిది ప్రేక్షకులకు కన్ఫ్యూజనే.

 

Related Articles

ట్రేండింగ్

Roja: నగరి నియోజకవర్గంలో ఒంటరి పక్షిలా మారిన రోజా.. శత్రువులే తప్ప మిత్రులు లేరా?

Roja:  నగరి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మంత్రి రోజా ప్రస్తుతం నగరి నియోజకవర్గంలో ఒంటరి పక్షిగా మారిపోయారు. ఈమె 2014 ఎన్నికలలో వైసిపి నుంచి గెలుపొందారు. అలాగే 2019 సంవత్సరంలో కూడా 2...
- Advertisement -
- Advertisement -