NTR: తారక్ కు మాత్రమే ఈ రికార్డ్ సొంతమవుతుందా?

NTR: సినిమా కెరీర్‌లో హీరోల‌కు స‌క్సెస్ అనేది చాలా అవ‌స‌రం. అయితే అది అంత సులువుగా ద‌క్క‌దు. కొంత‌మంది హీరోల‌కు ఒక సినిమా స‌క్సెస్ అయితే త‌రువాత ఒక ప‌ది సినిమాలు ఫెయిలైన సంద‌ర్భాలు కూడా చాలానే ఉన్నాయి. అయితే యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాత్రం వరుస సక్సెస్ లను సొంతం చేసుకుంటూ బాక్సాఫీస్ వద్ద తన పవర్ చూపిస్తూ మార్కెట్ పెంచుకుంటున్నారు.

 

తార‌క్ స‌క్సెస్ ఫార్ములా
ఒక‌ప్పుడు వ‌రుస ఫెయిల్యుర్స్‌లో డీలా ప‌డిన ఎన్‌టీఆర్ టెంప‌ర్ సినిమా నుండి త‌న రూటు మార్చాడు. అభిమానులు త‌న నుండి ఏం కోరుకుంటున్నారో తెలుసుకున్నాడు. ఒక సినిమా క‌థ‌కు మ‌రో సినిమా క‌థ‌కు ఏమాత్రం పొంత‌న లేకుండా వైవిధ్య‌మైన పాత్ర‌ల‌ను చేస్తూ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటున్నాడు. ఈ సక్సెస్ ఫార్ములాను ఆర్‌.ఆర్‌.ఆర్. సినిమా వ‌ర‌కూ కంటిన్యూ చేశాడు.

 

ఆర్.ఆర్.ఆర్ సక్సెస్ తారక్ మార్కెట్ గ్లోబ‌ల్ లెవెల్‌లో భారీగా పెరిగింది. దీంతో త‌ర్వాత చేయ‌బోయే సినిమాల విష‌యంలో ఆయ‌న ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఈసారి చేసే సినిమా ఎలా అయినా హిట్ కొట్టాల‌ని చూస్త‌న్నారు. టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జై లవకుశ, అరవింద సమేత వీర రాఘవ, ఆర్.ఆర్.ఆర్ వంటి వ‌రుస హిట్‌లు సాధించిన ఆయ‌న భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో కూడా విజయాలను సొంతం చేసుకుని ట్రిపుల్ హ్యాట్రిక్ సాధించాల‌ని ఆయ‌న అభిమానులు ఉత్సాహ‌ప‌డుతున్నారు.

 

ఇప్ప‌టికే కొర‌టాల శివ డైరెక్ష‌న్‌లో ఎన్టీఆర్ 30, ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో ఎన్టీఆర్ 31 సినిమాల‌ను అనౌన్స్ చేసిన ఎన్టీఆర్ త్వ‌ర‌లో ఎన్టీఆర్32 డైరెక్టర్ కు సంబంధించి స్ప‌ష్ట‌త ఇవ్వ‌నున్నారు. వరుసగా 9 విజయాలను సొంతం చేసుకుంటే నిజంగా అది చ‌రిత్ర‌లో నిలిచిపోయే రికార్డు అవుతుంది. దీంతో ఎలాగైన త‌రువాతి సినిమాతో హిట్ కొట్టి త‌న విజ‌యాల ఖాతాను మ‌రింత పెంచుకోవాల‌ని ఎన్టీఆర్‌తోపాటు ఆయ‌న అభిమానులు కూడా కోరుకుంటున్నారు.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -