NTR: ఎన్టీఆర్30 డైలాగ్ లీక్.. అదుర్స్ అనేలా ఉందిగా!

NTR: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఇప్పుడున్న స్టార్ హీరోల్లో యంగ్ టైగ్ ఎన్టీఆర్ మంచి ఫామ్ లో ఉన్నారు. రెండు దశాబ్దాల క్రితం హీరోగా పరిచయమైన ఆయన కెరీర్ ఆరంభంలోనే ఇండస్ట్రీలో హిట్లను తన ఖాతాలో వేసుకున్నారు. అంచెలంచెలుగా స్టార్ హీరోగా ఎదిగాడు. మధ్యలో కొన్ని పరాజయాలు ఇబ్బంది పెట్టినా కూడా ఇటీవలి కాలంలో మాత్రం వరుసగా హిట్లు మీద హిట్లు కొడుతూ విజయం సాధిస్తున్నాడు.

 

ఈ ఏడాది ఆరంభంలో రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాతో సంచలన విజయాన్ని తారక్ సొంతం చేసుకున్నాడు. అలాగే, పాన్ ఇండియా స్టార్‌గానూ తారక్ క్రేజ్ ను సంపాదించాడు. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత టాలీవుడ్ ఆల్‌రౌండర్ జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటికే రెండు ప్రాజెక్టులకు సైన్ చేశాడు. అందులో టాప్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించే మూవీ తారక్ 30వ సినిమా కావడం విశేషం. తారక్ ముప్పైవ చిత్రంగా దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఆ అంచనాల మధ్య వస్తోన్న ఇది మాత్రం అనుకున్న సమయానికి మొదలు కావడం లేదు.

ఈ మధ్యనే చిత్ర యూనిట్ ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా సాగుతున్నట్లు తెలిపింది. అంతేకాదు, సినిమా షూటింగ్ కోసం లొకేషన్లను వెతుకున్నట్లు కూడా ప్రకటించింది. క్రేజీ కాంబినేషన్‌లో రూపొందబోతున్న ఈ సినిమా గురించి ఎన్నో రకాల వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

 

మరీ ముఖ్యంగా ఇందులో ఎన్టీఆర్ రోల్ గురించి ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ చిత్రంలో తారక్ ఆరు వేళ్లు ఉన్న చేతితో కనిపించబోతున్నాడని, ఆ ఎక్స్‌స్ట్రా ఫింగరే అతడి క్యారెక్టర్‌ను ఎలివేట్ చేసేలా డిజైన్ చేశారని ఒక టాక్ వినిపిస్తోంది. అలాగే ఈ సినిమాలోని ఓ డైలాగ్ కూడా లీక్ అయ్యింది. ఆ లీకైన డైలాగ్ ఏంటంటే.. నేను వేటాడే సింహాన్ని.. ఒక్కసారి దృష్టి పెడితే వేట పూర్తయ్యేవరకు వెనుకడుగెయ్యను! అంటూ ఉంది. ఈ డైలాగ్ విని తారక్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

ఏపీలో ఆడుదాం ఆంధ్ర పోటీలకు రిజిస్ట్రేషన్లు ప్రారంభం.. రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలంటే?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ ఎప్పటికప్పుడు సంచలన నిర్ణయాలు తీసుకుంటూ విద్యార్థులు, యువతకు మేలు చేస్తున్న సంగతి తెలిసిందే. జగన్ సర్కార్ ఆడుదాం ఆంధ్ర పేరుతో క్రీడా పోటీలను నిర్వహిస్తుండగా...
- Advertisement -
- Advertisement -