Rajamouli-Mahesh Babu: అయ్యో దేవరే.. మహేష్ సీన్లను జక్కన్న ఆ టెక్నాలజీని వాడి తీస్తారా?

Rajamouli-Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మిల్క్ బాయ్ పేరు సంపాదించుకున్న మహేష్ బాబు ఎంతో హ్యాండ్సమ్ గా ఉంటూ ఎంతో మంది అమ్మాయిలను అభిమానులుగా మార్చుకున్నారు. ఎండ తగిలితే కందిపోయే అంత చర్మ సౌందర్య రహస్యం మహేష్ బాబుది.కెరియర్ మొదట్లో అందరూ హీరోలు మాదిరిగా పెద్ద ఎత్తున ఫైట్లు చేస్తూ భారీ ఫ్యాక్షన్స్ సన్ని వేషాలలో నటించే మహేష్ బాబు ఈ మధ్యకాలంలో చాలా సుఖం పొందారని తెలుస్తుంది.

ఈయన సినిమా షూటింగ్ అంటే ఎండ ఏమాత్రం తగలకుండా అంతా ఏసి సెట్ లోని షూటింగ్ జరగాలని ఆరాటపడుతూ ఉంటారు. మహర్షి సినిమాలో గేదెలతో ఒక సన్నివేశం చేయాల్సి వస్తే మహేష్ బాబు ఆ ఎండలో నిలబడి చేయలేక ఒక ఏసీ సెట్ వేయించుకొని గేదెలను కూడా అందులోకి తీసుకువచ్చి షూటింగ్ చేయించారు. అంతలా ఈయన సుఖానికి అలవాటు పడ్డారని చెప్పాలి.

 

ఇలా ఎండకు పోతే కమీలిపోయే మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేయబోతున్నారు. ఇక రాజమౌళి సినిమా అంటే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే సినిమా ద్వారా ఏకంగా నలుగురు హీరోలు తమ శరీరాలను బాగా గాయం చేసుకున్నారు.ఇక రాజమౌళి సినిమా అంటేనే ఒక మిలిటరీ క్యాంపు లాగా ఉంటుందని పలువురు భావిస్తారు ఇలాంటి మిలిటరీ క్యాంపులో మిల్క్ బాయ్ మహేష్ బాబు ఎలా షూటింగ్ చేస్తారా అన్నది అందరిలో తలెత్తిన సందేహం.

 

రాజమౌళి తీయబోయే మహేష్ చిత్రమంతా ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ సాయంతో ఎక్కువగా జరుగుతుందట. ఒకసారి క్యారెక్టర్ ఇమేజ్ సృష్టి జరిగిపోయాక మోషన్ కాప్చర్లో ఎవరు నటించినా ఒకటే. అయితే అవి యానిమేషన్ తరహా ఇమేజులు, ఇప్పుడు రాజమౌళి అమలుపరుస్తున్నట్టు సమాచారం.కేవలం క్లోజప్ షాట్స్ లో మాత్రం మహేష్ బాబు పై చిత్రీకరించి మిగిలినది మొత్తం మోషన్ క్యాప్చర్ ద్వారా షూటింగ్ చేయబోతున్నారని తెలుస్తుంది. ఇలా ఈ టెక్నాలజీ ఉపయోగించి మహేష్ బాబు సినిమాని రాజమౌళి చేయబోతున్నట్లు సమాచారం.

Related Articles

ట్రేండింగ్

Big Shock to Vanga Geetha: వైసీపీ అభ్యర్థి వంగా గీతకు వరుస షాకులు.. సమస్యలు పరిష్కరించకుండా ఓట్లు అడుగుతారా?

Big Shock to Vanga Geetha: మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే ఏపీ మొత్తం ఒకవైపు అయితే...
- Advertisement -
- Advertisement -