Jr NTR: నువ్వు బ్రతికితే ఏమి చస్తే ఏమి.. జూనియర్ ఎన్టీఆర్ ను తిట్టిందేవరో తెలుసా?

Jr NTR: ప్రస్తుతం అమరావతి రైతులు అమరావతి రాజధాని సాధన కోసం రైతులు మహా పాదయాత్ర చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ మహా పాదయాత్రలో భాగంగా ఓ ముసలావిడ యంగ్ టైగర్ ఎన్టీఆర్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ ఎన్టీఆర్ యూనివర్సిటీకి వైయస్సార్ పేరు పెట్టడం పట్ల ఎంతో మంది నందమూరి అభిమానులు తెలుగుదేశం నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

ఈ క్రమంలోనే ఈ విషయంపై ఎన్టీఆర్ స్పందించిన తీరును చాలామంది తప్పు పట్టారు. అయితే యూనివర్సిటీ వివాదంలో ఎన్టీఆర్ చేసిన ట్వీట్ చాలా మంది తెలుగుదేశం అభిమానులకు, ఎన్టీఆర్ అభిమానులకు మింగుడు పడలేదు. అయితే ఈ పాదయాత్రలో భాగంగా ఒక రిపోర్టర్ ఒక ముసలావిడని ఇదే విషయంపై పలకరించడంతో ఆ ముసలావిడ ఎన్టీఆర్ పై తిట్ల పురాణం మొదలు పెట్టింది.

ఈ సందర్భంగా ముసలావిడ మాట్లాడుతూ… జూనియర్ ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు గారి మనవడు అని చెప్పుకుంటున్నారు. అలా ఏమీ చెప్పుకోవద్దు మహానుభావా! నువ్వు నిజంగానే ఎన్టీఆర్ మనవడువు అయితే ముందుకు రా.. ఇలా మీ తాతను అవమానించిన ఇంకా నువ్వెందుకురా అంటూ ముసలావిడ రెచ్చిపోయింది.

ఇలాంటి మనవడు ఉంటేనేమి.. చస్తేనేమిమా తెలుగుదేశం పార్టీని మేమే ముందుకు తీసుకు వస్తాం అంటూ ఈమె చేసిన ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ముసలావిడ చేసిన వ్యాఖ్యలపై ఎన్టీఆర్ అభిమానులు ఏ విధంగా స్పందిస్తారనే విషయం తెలియాల్సి ఉంది.ఏది ఏమైనా ఈ యూనివర్సిటీ వివాదం ఎన్టీఆర్ అభిమానులకు, తెలుగుదేశం అభిమానులకు మింగుడు పడలేదని చెప్పాలి.

Related Articles

- Advertisement -

Trending News

- Advertisement -

Latest Posts