Om Raut: ఓం రౌత్ కు బుద్ధి, జ్ఞానం లేవా.. హీరోయిన్ తో అసభ్యంగా ప్రవర్తించాలా?

Om Raut: బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. ప్రభాస్, కృతి సనన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నటువంటి ఆది పురుష్ సినిమాకు ఈయన దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమా జూన్ 16వ తేదీ ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఈయన తాజాగా తిరుపతిలో జరిగిన ప్రీ రిలీజ్ వేడుకకు హాజరయ్యారు.

ఇలా ఈ వేడుకకు హాజరైనటువంటి చిత్ర బృందం ఈ కార్యక్రమం పూర్తి అయిన తర్వాత నేడు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.ఈ విధంగా స్వామివారి దర్శనం అనంతరం నటి కృతి సనన్ ముంబైకి వెళ్లాల్సి ఉంది అయితే అప్పటికే ఆమెకి ఫ్లైట్ టైం కావడంతో హుటాహుటిన బయలుదేరుతున్నారు. అయితే స్వామివారి దర్శనం అనంతరం ఆమెకు సెండ్ ఆఫ్ ఇవ్వడం కోసం డైరెక్టర్ ఆమెను హగ్ చేసుకున్నారు.

 

ఇలా తనకు షేక్ హ్యాండ్ ఇచ్చి హగ్ చేసుకోవడమే కాకుండా తన బుగ్గపై ముద్దు కూడా పెట్టారు. దీంతో ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో సంచలనంగా మారడంతో ప్రతి ఒక్కరు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇలాంటివన్నీ సినిమా సెలబ్రిటీలకు సర్వసాధారణం అయితే ఇందులో తప్పు పట్టాల్సిన అంశం ఏంటంటే కలియుగ దైవమైన సాక్షాత్తు శ్రీవారి సన్నిధిలోను ఆయన కొండపై ఈ విధంగా హీరోయిన్ పై ముద్దులు పెట్టడమే ఆయన చేసిన తప్పు అని చెప్పాలి.

 

ఇలా స్వామివారి సన్నిధిలో హీరోయిన్ కు ముద్దు పెట్టడమే కాకుండా తనని హగ్ చేసుకోవడంతో పలువురు ఈ వ్యవహారంపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరించారు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో నేటిజన్స్ సైతం కొంచెం కూడా బుద్ధి జ్ఞానం లేకుండా ఇలా కొండపై ముద్దులు పెట్టుకోవడం ఏంటి అంటూ మండిపడుతున్నారు. మరి ఈ వివాదం పై దర్శకుడు ఏ విధంగా స్పందిస్తారో తెలియాల్సి ఉంది.

 

 

Related Articles

ట్రేండింగ్

CM Jagan Stone Attack: అమ్మా నాన్నేరీ అంటున్న పిల్లలు.. జగన్ పై దాడి కేసులో దుర్గారవు నిజంగా తప్పు చేశారా?

CM Jagan Stone Attack: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై దాడి ఘటనలో భాగంగా ఆటో డ్రైవర్ దుర్గారావును పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. జగన్ పై రాయి దాడి...
- Advertisement -
- Advertisement -