Nani: మరోసారి అదరగొట్టిన నాని.. ఇండస్ట్రీ హిట్ గ్యారంటీ!

Nani: శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా దసరా. ఈ సినిమాలో నాచురల్ స్టార్ హీరో నాని, మహానటి ఫేమ్ కీర్తి సురేష్ జంటగా నటించారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై ఈ సినిమాను సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నాడు. ఇందులో సముద్ర కానీ, జరీనా వహాబ్ తదితరులు కూడా కీలక పాత్రలో నటించారు.

ఈ సినిమా కేవలం తెలుగులోనే కాకుండా తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషలో విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు వెలువడ్డాయి. గతంలో టీజర్, లుక్స్ విడుదల కాగా ప్రేక్షకులు ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అని అప్పుడే అనుకున్నారు. విడుదలైన పాటలు కూడా యూట్యూబ్ లో బాగా హల్చల్ చేస్తున్నాయి.

 

అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల చేశారు సినీ బృందం. ఇక ట్రైలర్ చూసి ఇండస్ట్రీ హిట్ గ్యారెంటీ అని ప్రేక్షకులు రివ్యూ ఇచ్చేశారు. ఇక కాసేపటి క్రితమే విడుదలైన ఈ ట్రైలర్ ను ఎంతోమంది ప్రేక్షకులు చూసేసారు. ట్రైలర్ అద్భుతం అంటూ లైక్స్ కొడుతున్నారు.

 

ఇక ట్రైలర్ ప్రారంభంలో బతుకమ్మ పాట వినిపిస్తూ వెన్నెల వచ్చిందిరా అంటూ కీర్తి సురేష్ ని చూపించగా అందులో కీర్తి సురేష్ పల్లెటూరి అమ్మాయిల చాలా న్యాచురల్ గా కనిపించింది. ఇక కీర్తి సురేష్ పెళ్లి కూతురు గెటప్ లో కనిపిస్తూ.. ధరణిగా పెట్టి పుట్టావురా నా కొడకా అంటూ డైలాగ్ కొట్టింది. ఆ తర్వాత నాని ఎంట్రీ మాత్రం మామూలుగా లేదని చెప్పాలి.

 

ముఖ్యంగా ఫైటింగ్ సీన్స్ లలో నాని అదరగొట్టేశాడు. మధ్యలో ఫ్రెండ్షిప్ గురించి డైరెక్టర్ అద్భుతంగా చూపించినట్లు అనిపిస్తుంది. ఇక నాని డైలాగ్స్ కూడా బాగా అనిపించాయి. మొత్తానికి ఈ సినిమా మంచి మాస్ యాక్షన్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి సందడి చేయడానికి సిద్ధంగా ఉంది. ఇక ఈ ట్రైలర్ చూసినట్లయితే నాని మరోసారి తన ఖాతాలో హిట్ కొట్టడం ఖాయమని అర్థమవుతుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu: వారికి 500 యూనిట్ల వ‌ర‌కు విద్యుత్‌.. చంద్రబాబు హామీతో ఆ వర్గం ఓట్లు టీడీపీకే వస్తాయా?

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు అన్ని వర్గాల ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని వరాల జల్లు కురిపిస్తున్నారు. నిరుద్యోగులు, రైతులు, మహిళలు, చేనేత కార్మికులు ఇలా.. ఒక్కొక్కరికి ఏం కావాలి? వాళ్లకి ఎలాంటి...
- Advertisement -
- Advertisement -