Investment Frauds: సైబర్ నేరగాళ్ల ఘరానా మోసం.. ఏకంగా కోటి 33 లక్షలు స్వాహా!

Investment Frauds: ప్రస్తుత కాలంలో బాగా చదువుకున్న వారు దొంగలుగా మారిపోతున్నారు. ఒకప్పటి కాలంలో అంటే ప్యాకెట్లు దొంగతనం చేయడం, చైన్ స్కాచింగ్ లాంటివి ఎక్కువగా చేస్తూ ఉండేవారు. కానీ నేటి సమాజంలో ఒక దేశంలో ఉండి మరియొక దేశంలో ఉన్న వారి దగ్గర నుంచి డబ్బును కాజేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. ప్రస్తుతం ఉన్న ప్రజలలో క్విప్టో కరెన్సీలో ఇన్వెస్ట్ చేస్తే కోట్లలో లాభం వస్తుందని చాలామంది నమ్ముతున్నారు.

అలా నమ్మడమే కాకుండా కొంతమంది సైబర్ నేరగాళ్ల చేతులలో మోసపోతున్నారు కూడా. తాజాగా ఇలాంటి ఒక ఘటన హైదరాబాద్లో జరిగింది.ఏకంగా కోటి రూపాయల 33లక్షలు కాజేశారు సైబర్ నేరగాళ్ల. మోసపోయామని ఆలస్యంగా తెలుసుకున్న బాధితులు పోలీసులను సంప్రదించారు. సోమవారం ఒక్కరోజే హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో రెండు సైబర్ క్రైమ్ కేసులు నమోదు అవ్వడం విశేషం.

క్రిప్టోలో ట్రేడింగ్ పెట్టుబడి పెడితే లాభాలే లాభాలు అంటూ ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పని చేస్తున్న యువతిలో లేనిపోని ఆశలు సైబర్ నేరగాళ్లు కల్పించారు. చైనాకు చెందిన క్రిప్టో ట్రేడర్ గా ఇన్ స్టాలో పరిచయం చేసుకున్న నేరగాళ్లు, ఆ చదువుకున్న యువతిని నమ్మించి మోసం చేశారు. వారి మాటలు నమ్మిన యువతి గుడ్డిగా రూ.91లక్షలు ఇన్వెస్ట్ కూడా చేసింది.

ఇన్వెస్ట్ చేసిన వెంటనే అంత పెద్ద మొత్తం చేతికి రావడంతో సైబర్ నేరగాళ్లు ఆ డబ్బుతో జంప్ అయిపోయారు. ఆ నేరగాళ్ల నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడంతో డబ్బు తిరిగి రాదు నేను మోసపోయానని గ్రహించిన యువతి తనకు న్యాయం చేయాలంటూ సైబర్ క్రైమ్ పోలీసులను సంప్రదించింది. మరొకటి ఇలాంటి కేసులో ఇన్వెస్ట్ మెంట్ పేరుతో సుల్తాన్ బజార్ కి చెందిన యువకుడికి ఒక భారీ మోసం చేశారు సైబర్ నేరగాళ్లు.

ఆ యువకుడి నుంచి 42లక్షల రూపాయలు కొట్టేశారు. భారీ లాభాలు వస్తాయని నమ్మించడంతో ఆ యువకుడు పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాడు. డబ్బులు తిరిగి రాకపోవడంతో తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు గుండెలు బాదుకుంటూ, తనకు న్యాయం జరిగేలా చూడాలని సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. ఈ రెండు కేసులు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసుల టీం దర్యాఫ్తు చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Rayalaseema: చంద్రబాబు ఎంట్రీతో సీమలో పరిస్థితి మారుతోందా.. ఆ స్థానాల్లో టీడీపీనే గెలుస్తోందా?

Rayalaseema: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజాగళం అని పేరిట యాత్రను ప్రారంభించిన సంగతి మనకు తెలిసిందే. నిన్న పలమనేరులో ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమం ఎంతో విజయవంతం అయింది ఇకపోతే ఈ...
- Advertisement -
- Advertisement -