Lionel Messi: డిసెంబరులో పుట్టిన ప్రతి 70 మంది పిల్లల్లో ఒకరికి మెస్సీ పేరు..!!

Lionel Messi: కొంతకాలంగా ఫుట్‌బాల్ క్రీడలో అర్జెంటీనా స్టార్ ఆటగాడు లియోనల్ మెస్సీ పేరు మారుమోగిపోతోంది. గతేడాది డిసెంబర్‌ 18న జరిగిన ఫిఫా వరల్డ్‌కప్‌ ఫైనల్ మ్యాచ్‌లో అర్జెంటీనాను మూడోసారి విశ్వవిజేతగా నిలిపిన మెస్సీ.. తన వరల్డ్‌కప్‌ కలను సాకారం చేసుకున్నాడు. అప్పటి నుంచి మెస్సీ పేరు మరింతగా వినిపిస్తోంది. ముఖ్యంగా అభిమానులు అతడిని దేవుడితో సమానంగా కొలుస్తున్నారు.

 

మన దేశంలో సచిన్‌కు ఎంత ఫాలోయింగ్ ఉండేదో అంతకుమించి మెస్సీకి అర్జెంటీనాలో ఫాలోయింగ్ కనిపిస్తోంది. అర్జెంటీనాలో డిసెంబర్‌లో పుట్టిన పిల్లల్లో ప్రతి 70 మందిలో ఒకరికి మెస్సీ పేరు వచ్చేలా లియోనెల్‌ లేదా లియోనెలా అనే పేర్లు పెట్టారట. సాంటా ఫె ప్రావిన్స్‌లోని సివిల్ రిజిస్ట్రీ చూస్తే ఇది స్పష్టమవుతోంది.

 

గతేడాది సెప్టెంబర్‌ వరకూ లియోనల్ లేదా లియోనెలా అనే పేర్లు ఉన్న పిల్లల సంఖ్య నెలకు ఆరుగా ఉండేది. అది అక్టోబర్‌, నవంబర్‌ నెలల్లో 32కు చేరింది. ఇక డిసెంబర్‌లో అర్జెంటీనా వరల్డ్‌కప్‌ గెలవడంతో ఈ పేర్లు ఉన్న పిల్లల సంఖ్య ఏకంగా 49కి చేరడం విశేషం అనే చెప్పాలి. మెస్సీ పేరు మాత్రమే కాకుండా వరల్డ్‌కప్‌ గెలిచిన టీమ్‌లోని మిగతా సభ్యుల పేర్లు పెట్టుకోవడానికి కూడా అర్జెంటీనా అభిమానులు ఆసక్తి చూపుతున్నారు.

 

1986 తర్వాత వరల్డ్ కప్ గెలిచిన అర్జెంటీనా
1986 తర్వాత ఫుట్‌బాల్ క్రీడకు సంబంధించి తొలిసారి అర్జెంటీనా వరల్డ్‌కప్‌ గెలిచింది. మొత్తంగా ఆ టీమ్‌ విశ్వవిజేతగా నిలవడం ఇది మూడోసారి. 2022 వరల్డ్‌కప్‌ ఫైనల్లో ఫ్రాన్స్‌ను పెనాల్టీల్లో 4-2తో ఓడించిన అర్జెంటీనా మెస్సీ సారథ్యంలో తొలిసారి ట్రోఫీని సొంతం చేసుకుంది. ఈ టోర్నీలో మెస్సీ ఏడు గోల్స్‌ చేసి గోల్డెన్‌ బాల్ అవార్డు గెలుచుకున్నాడు. రెండుసార్లు ఈ అవార్డు గెలిచిన ఏకైక ఆటగాడిగానూ మెస్సీ నిలిచాడు. చాన్నాళ్లుగా ఫుట్‌బాల్‌ ఆడుతున్నా వరల్డ్‌కప్‌ గెలవలేదన్న బాధ మెస్సీకి ఇన్నాళ్లూ ఉండేది. అయితే ఇప్పుడు ఆ కల కూడా నెరవేరింది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -