OnePlus: వన్ ప్లస్ శుభవార్త.. ఫోన్లపై 25 శాతం వరకు డిస్కౌంట్

OnePlus: ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వన్ ప్లస్ ఫోన్లను చాలామంది ఇష్టపడతారు. ఫోన్ స్ట్రైల్, ఫీచర్లు,బ్యాటరీ బ్యాకప్ బాగుంటుందనే కారణంతో చాలామంది కొనుగోలు చేస్తారు. అలాగే కెమెరా క్వాలిటీ కూడా బాగుంటుంది. అందుకే ఫొటోలు అంతే ఇష్టపడేవారు ఈ ఫోన్లను ఎక్కువగా కొనుగోలు చేస్తారు. ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లతో వన్ ప్లస్ అప్డేడెట్ వెర్షన్లను విడుదల చేసింది.

తాజాగా వన్ స్లస్ నార్డ్ సిరీస్ ఫోన్ ను తీసుకొచ్చింది. ఈ ఫోన్ ధర చాలా తక్కువే. రూ.20 వేల నుంచి రూ.30 వేల మధ్యలో ఈ సిరీస్ ఫోన్ల ధరలు ఉన్నాయి. అలాగే ఎంపిక చేసిన మోడళ్ల ఫోన్లపై 20 శాతం వరకు వన్ ప్లస్ డిస్కౌంట్ ఇస్తుంది.

వన్ ప్లస్ నార్డ్ వీఈ లైట్ 5జీ ఫోన్ వివరాలు ఇలా ఉన్నాయి. ఈ ఫోన్ ధర రూ. 19, 999 గా ఉండగా.. ప్రస్తుతం 5 శాతం డిస్కౌంట్ అందిస్తుండటంతో రూ.18,999గా మార్కెట్ లో లభిస్తుంది. ఇక క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే రూ.వెయ్యి అదనంగా డిస్కౌంట్ వస్తుంది. ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ విషయానికొస్తే.. ఆండ్రాయిడ్ 12 ఓెఎస్ తో పనిచేస్తుంది. 33 వాట్ ఊక్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో పాటు 16 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 5 వేల ఎంఏహెచ్ బ్యాటలీ, ట్రిపుల్ కెమెరా సపోర్ట్, ఆక్టా కోర్ స్పాన్ డ్రాగన్ 695 ప్రాసెసర్ కలిగి ఉన్నాయి. 6.59 అంగుళాల ఫుల్ హెచ్ డీ డిస్ ప్లే కలిగి ఉంటుంది.

ఇక వన్ ప్లస్ 9జీ ధర రూ.49,999గా ఉండగా.. ప్రస్తుతం 24 శాతం డిస్కౌంట్ ఆఫర్ తో రూ.37,999కి వస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 11 ఓఎస్ తో పనిచేస్తుంది. 4,500 ఎంఏహెచ్ బ్యాటరీ, 65 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 16 ఎంపీ ఫ్రంట్ కెమెరా, బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా, ఆక్టా కోర్ స్పాన్ డ్రాగన్ 695 ప్రాపెషర్ కలిగి ఉంటుంది.

Related Articles

ట్రేండింగ్

News Arena India: మళ్లీ జగనే సీఎం.. మరో సంచలన సర్వే.. న్యూస్ ఎరేనా సర్వేలో వైసీపీ సీట్ల లెక్క ఇదే!

News Arena India: ఏపీలో అధికార వైసీపీ ప్రచారంలో దూసుకుపోతుంది. ఆ పార్టీ అధినేత జగన్ తనదైన సిద్దం సభలను మొదట నిర్వహించి పార్టీ శ్రేణులు, కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. ఆ తర్వాత...
- Advertisement -
- Advertisement -