5G Mobiles: అతి తక్కువ ధరకే ఒప్పో 5జి స్మార్ట్ ఫోన్.. వివరాలివే?

5G Mobiles: రోజురోజుకి టెక్నాలజీ మరింత డెవలప్ అవుతోంది. దీంతో మనుషులు టెక్నాలజీకి బాగా అలవాటు పడిపోయారు. ఈ నేపథ్యంలోనే కొత్తగా ఏ ఫీచర్ కనిపించినా కూడా వెంటనే దానిని సొంతం చేసుకోవాలని చాలామంది తెగ అరాటపడుతూ ఉంటారు. మరీ ముఖ్యంగా మొబైల్ ఫోన్స్ విషయంలో అయితే ఈ విషయం బాగా వర్తిస్తుంది అని చెప్పవచ్చు. మార్కెట్లోకి కొత్తగా ఏదైనా మొబైల్ వచ్చింది అంటే చాలా మంది వాటిని కొనుగోలు చేయడానికి ఎక్కువగా ఆ వ్యక్తిని చూపిస్తూ ఉంటారు. ఇక సరికొత్తగా ఏదైనా ఫీచర్ వచ్చింది అంటే వెంటనే ఆ మొబైల్ ని వాడే వరకు నిద్రపోరు.

 

ఇప్పటికే మార్కెట్లోకి ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్లు లాంచ్ కాగా తాజాగా మార్కెట్లోకి ఒక సరికొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ అయింది. అదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ ఒప్పో న్యూ మోడల్ ఒప్పో ఎ58ఎక్స్ 5జీ స్మార్ట్ ఫోన్ ని ను చైనాలో ఈ ఏడాది నవంబర్ నెలలో విడుదల చేసింది. 5జీ టెక్నాలజీకి అనుగుణంగా ఒప్పో కంపెనీ తన కొత్త హ్యాండ్‌సెట్ ఒప్పో ఎ58ఎక్స్ 5జీ ను విడుదల చేసింది. ఇకపోతే ఈ మోడల్‌ లోని ముఖ్యమైన ఫీచర్ల విషయానికి వస్తే.. పెద్ద స్క్రీన్, ఎక్కువ సమయం నిలిచే బ్యాటరీ, మంచి ప్రాసెసర్ వంటివి అనేకం ఉన్నాయి. OPPO A58x 5G స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే..

 

ఈ స్మార్ట్‌ ఫోన్ 6.56 అంగుళాల LCD డిస్ప్లేను కలిగి ఉంటుంది. అలాగే హెచ్డీ ప్లస్ 720×1612 పిక్సెల్ రిజల్యూషన్‌ను అందిస్తుంది. అదే ఇంకా 90 Hz రిఫ్రెష్ రేట్, 269 పిక్సెల్స్ పర్ ఇంచ్ పిక్సెల్ డెన్సిటీతో ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 12 ColorOS 12.1 సాఫ్ట్‌వేర్‌ను కలిగి ఉంది. ఒప్పో ఏ 58ఎక్స్ 5జీ లో స్పీడ్, మల్టీ టాస్కింగ్ కోసం మీడియాటేక్ డైమెన్సిటీ 700 చిప్‌సెట్ ఉంది. దీని ర్యామ్ 8 జీబీ , 128 జీబీ స్టోరేజ్‌తో పాటు మైక్రో SD కార్డ్ ద్వారా స్టోరేజీని పెంచుకునే అవకాశాన్ని కూడా ఇస్తుంది. అలాగే ఇది 5000 mAh బ్యాటరీ సామర్ధ్యం కలిగిఉంది. ఈ స్మార్ట్ ఫోన్ ధర విషయానికి వస్తే.. 6జీబీ ర్యామ్ , 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీతో ఉన్నన ఈ మోడల్ ప్రస్తుతానికి ఇంకా భారత్‌లో లాంచ్ అవలేదు. అయితే చైనాలో దీని ధర 1200 చైనీస్ యువాన్ అనగా మనం ఇండియన్ కరెన్సీ ప్రకారం సుమారు 14 వేల 206 రూపాయలు.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -