Ori Devuda Movie Review: ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్

విడుదల తేదీ : అక్టోబర్ 21, 2022

నటీనటులు : వెంకటేశ్ (ప్రత్యేక రోల్), విశ్వక్ సేన్, మిథిలా పాల్కర్, ఆశా భట్, మురళీ శర్మ, నాగినీడు, రాహుల్ రామకృష్ణ తదితరులు

నిర్మాతలు : పెరల్ వి పొట్లూరి – పరమ్ వి పొట్లూరి

దర్శకత్వం : అశ్వత్ మారిముత్తు

డైలాగులు : తరుణ్ భాస్కర్

సంగీతం : లియోన్ జేమ్స్

ఎడిటర్ : విజయ్

సినిమాటోగ్రఫీ : విధు అయ్యన్న

Ori Devuda Review And Rating

తమిళ సినిమా ఓహ్ మై కడవులే చిత్రం కరోనా విపత్తుకు ముందే అక్కడ మంచి హిట్ కొట్టింది. అంతేకాదు.. ప్రేమికుల రోజు సందర్భంగా రిలీజై సెన్సేషన్ క్రియేట్ చేసింది. దాంతో పాటు విమర్శకుల నోళ్లు మూయించేలా టొరంటోలో జరిగిన ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శితమైంది. అలాంటి భిన్నమైన కథను తెలుగు వారి ముందుకు తెచ్చే ఉద్దేశంతో రీమేక్ కు శ్రీకారం చుట్టింది పీవీపీ టీమ్.

ఇందులో తమిళ సినిమాకు పని చేసిన డైరెక్టర్ నే తీసుకురావడం, లేటెస్ట్ గా మంచి చిత్రాలతో తనదైన ముద్ర వేస్తున్న విశ్వక్ సేన్ హీరోగా తీసుకోవడం ద్వారా హిట్ కు పక్కాగా ప్లాన్ చేశారు. స్పెషల్ అప్పియర్స్ గా విక్టరీ వెంకటేష్ ను తీసుకొని ఇక హిట్ ట్రాక్ పైకి ఎక్కించే ప్రతయ్నం చేశారు. ఈ ప్రాజెక్టు ప్రకటించినప్పటి నుంచే ప్రేక్షకుల్లో కొన్ని అంచనాలు ఏర్పడ్డాయి. దీంతోపాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రావడం ప్లస్ పాయింట్ అయ్యింది. ఇంటర్వ్యూల్లోనూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను ఆకట్టుకొనేలా విశ్వక్ సేన్ ప్రసంగించడం ప్లస్ అయ్యిందని చెప్పొచ్చు. ప్రామిసింగ్ పిక్చర్ గా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో సమీక్షిద్దాం..

ఇక స్టోరీలోకి వెళితే.. అర్జున్ దుర్గరాజు (విశ్వక్ సేన్), అనుపాల్ రాజ్ (మిథిలా పాల్కర్), మీరా (ఆశా భట్) పాత్రల చుట్టూ కథ నడిపిస్తాడు దర్శకుడు. ఈ మూడు పాత్రల సంఘర్షణ, క్యారెక్టర్ రోల్స్, సరైన మార్గంలో తీసుకెళ్లే బాధ్యత నేరుగా దేవుడే తీసుకుంటే ఎలా ఉంటుందనేదే ఈ చిత్రం. ఫాంటసీ ఎలిమెంట్స్ తో ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కథ జోడించాడు దర్శకుడు. అర్జున్, అను స్నేహితులుగా ఉంటారు. పెళ్లి చేసుకుందామా అంటూ అను చేసిన ప్రపోజల్ కు అర్జున్ ఓకే చెబుతాడు. దీంతో ఇద్దరూ పెళ్లి చేసుకుంటారు. అనుపై తనకు ఉన్నది స్నేహ భావనే కానీ మరో ఫీలింగ్ లేదంటూ రియలైజ్ అయిన అర్జున్.. ఆమెకు దూరమవుతూ వస్తాడు. ఇక్కడి నుంచి అసలు కథ మొదలవుతుంది. ఫ్లాష్ బ్యాక్ లో అర్జున్ స్కూల్ డేస్ లో అర్జున్ క్రష్ మీరా రాకతో వీరిద్దరి మధ్య గొడవ మరింత పెరుగుతుంది. ఇలా ఫస్ట్ ఆఫ్ అంతా నడుస్తుంది.

ఇక సెకండాఫ్ లోకి వస్తే.. వీరిద్దరి గొడవ ముదిరి పాకాన పడి విడాకుల దాకా వెళ్తుంది. ఇక చెప్పలేనన్ని సమస్యలతో సతమతమవుతున్న హీరోకు మరో చాన్స్ ఇచ్చి సరిదిద్దుకొనే అవకాశం కల్పించడానికి దేవుడే దిగి వస్తాడు. ఆ దేవుడి రూపమే విక్టరీ వెంకటేష్ క్యారెక్టర్. ఈ నేపథ్యంలో వెంకటేష్ హీరోను ఆట పట్టించే తీరు, కలిగే పరిణామాలు ఆసక్తికరంగా తీర్చిదిద్దారు.

విశ్లేషణ: ప్రతి కథకూ స్క్రీన్ ప్లే ముఖ్యం. ఆడియన్స్ ను ఆకట్టుకోవాలంటే ఏ సీన్ లోనూ బోర్ కొట్టించకుండా ప్లాన్ చేసుకోవాలి. ఈ విషయంలో ఓరి దేవుడా డైరెక్టర్ ఫస్టాఫ్ లో సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. ప్రథమార్థం ఆద్యంతం మంచి మార్కులు పడేలా ప్లాన్ చేశారు. అయితే, సెకండాఫ్ విషయంలో కాస్త తడబాటు పడ్డాడని అనిపిస్తుంది. ప్రత్యేకించి కొన్ని సీన్లలో డ్రమాటిక్ డోసు ఎక్కువైందనిపిస్తుంది. చివరకు కాస్త జాగ్రత్త పడిన డైరెక్టర్.. డ్యామేజీ అవ్వకుండా చర్యలు తీసుకున్నాడు.

క్లయిమాక్స్ విషయంలోనూ అందరూ ఊహించిందే అయినప్పటికీ బోర్ కొట్టకుండా కేర్ తీసుకున్నాడు. ప్రేక్షకులు యాక్సెప్ట్ చేసే రేంజ్ లో తీసినట్లు అనిపిస్తుంది. తమిళంలో విజయ్ సేతుపతి దేవుడి క్యారెక్టర్ చేశాడు. ఈ స్థానంలో విక్టరీ వెంకటేష్ పూర్తి న్యాయం చేశాడని చెప్పొచ్చు. నటుడిగా విశ్వక్ సేన్ కొంత పరిణతి సాధించినట్లు కనిపిస్తోంది. డ్యాన్స్ లోనూ మెరుగయ్యాడు. హీరోయిన్లు ఇద్దరూ తమ పాత్రలకు న్యాయం చేశారు. మురళిశర్మతోపాటు అర్జున్ ఫ్రెండ్ గా చేసిన నటుడు కథకు కొత్తదనం అద్దారు. సంచలన డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కూడా ఇందులో తళుక్కుమనడం కొసమెరుపు. టెక్నీషియన్ల ఎఫర్ట్ కూడా సినిమాకు ప్లస్ అవుతుంది. మ్యూజిక్ కూడా ఫర్వాలేదనిపించింది.

ప్లస్ పాయింట్స్ :

విశ్వక్ సేన్ నటన

విక్టరీ వెంకటేష్ గెస్ట్ అప్పియరెన్స్

బ్యాగ్రౌండ్ మ్యూజిక్

మైనస్ పాయింట్స్ :

సెకండాఫ్ కు షిఫ్ట్ అయ్యే క్రమంలో తడబాటు

ఊహించిన క్లైమాక్స్

రేటింగ్ 2.5/5

బాటమ్ లైన్ : సరదాగా ఓ సారి చూడొచ్చు

Related Articles

ట్రేండింగ్

Namrata Shirodkar: రోజురోజుకూ మహేష్ భార్య చిన్నపిల్లవుతోంది.. 50 ఏళ్ల వయస్సులో ఇదేం అందమంటూ?

Namrata Shirodkar:  మనకు వయసు పైబడే కొద్ది మన అందం కూడా తగ్గుతుందని చెప్పాలి. ఇలా వయసు పైబడిన కొద్ది అందం కాపాడటం కోసం సెలబ్రిటీలు పెద్ద ఎత్తున కష్టపడుతూ ఉంటారు కానీ...
- Advertisement -
- Advertisement -