OTT: ఈ వారం థియేటర్లు, ఓటీటీలలో విడుదలయ్యే సినిమాలివే!

OTT: ఈ ఏడాది ముగింపుకు వచ్చేసింది. నాలుగు వారాల్లో కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. దీంతో షూటింగ్ పూర్తి చేసుకున్న చిత్రాలు, వెబ్ సిరీస్‌లను రిలీజ్ చేసేందుకు మేకర్స్ తొందరపడుతున్నారు. ఈ వారంలో థియేటర్/ఓటీటీలలో రిలీజయ్యే సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఏమున్నాయో తెలుసుకోండి.

అడవి శేష్ హీరోగా శైలేష్ కొలను డైరెక్షన్‌లో తెరకెక్కిన హిట్2 చిత్రం డిసెంబర్ 2న రిలీజ్ కానుంది. ఈ నెలకు ఇదే పెద్ద సినిమా. ఇందులో మీనాక్షి, రావు రమేష్, తనికెళ్ల భరణి, పోసాని కృష్ణమురళి తదితరులు నటిస్తున్నారు. ఒక అమ్మాయిని దారుణంగా చంపిన సైకో కిల్లర్‌ను హీరో ఎలా పట్టుకున్నాడు? అనే అంశంతో సినిమా రూపొందించింది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్స్ మూవీపై ఆసక్తిని పెంచుతున్నాయి.

మాస్ మహరాజ రవితేజ నిర్మిస్తున్న మట్టి కుస్తీ చిత్రం కూడా డిసెంబర్ 2న విడుదల కానుంది. ఇందులో కోలీవుడ్ నటుడు విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మి నటిస్తున్నారు.

విజయ్ సేతుపతి, బాబీ సింహా లాంటి టాలెంటెడ్ నటుల కాంబినేషన్‌లో జల్లికట్టు బసవ అనే డబ్బింగ్ చిత్రం కూడా డిసెంబర్ 2న విడుల కానుంది. అలాగే బాలకృష్ణ కోల, ప్రభాకర్ తదితరులు నటించిన నేనెవరు అనే థ్రిల్లర్ మూవీ కూడా శుక్రవారం విడుదలవుతోంది.

ఈ వారం ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు/వెబ్‌సిరీస్‌లు
నెట్‌ఫ్లిక్స్‌

☛ క్రైమ్‌ సీన్‌ టెక్సాస్‌ కిల్లింగ్‌ ఫీల్డ్స్‌ (వెబ్‌సిరీస్‌) నవంబరు 29
☛ మై నేమ్‌ ఈజ్‌ వెండెట్టా (ఇటాలియన్‌ మూవీ) నవంబరు 30
☛ ట్రోల్‌ (నార్వేజియన్‌ మూవీ) డిసెంబరు 1
☛ జంగిల్‌లాండ్‌ (హాలీవుడ్) డిసెంబరు 1
☛ గుడ్‌బై (హిందీ) డిసెంబరు 2

 

డిస్నీ+హాట్‌స్టార్‌
☛ విల్లో (వెబ్‌సిరీస్‌) నవంబరు 30
☛ రిపీట్‌ (తెలుగు) డిసెంబరు 1
☛ డైరీ ఆఫ్‌ ఎ వింపీకిడ్‌: రోడ్రిక్‌ రూల్స్‌ డిసెంబరు 2
☛ ఫ్రెడ్డీ (బాలీవుడ్‌)డిసెంబరు 2
☛ మాన్‌స్టర్‌ (మలయాళం) డిసెంబరు 2

 

జీ5
☛ ఇండియన్‌ లాక్‌డౌన్‌ (బాలీవుడ్‌) డిసెంబరు 2
☛ మాన్‌సూన్‌ రాగా (కన్నడ) డిసెంబరు 2

 

ప్రైమ్‌ వీడియో
☛ క్రష్డ్‌ (వెబ్‌సిరీస్‌ సీజన్‌2) డిసెంబరు 2
☛ కాంతార (తుళు) డిసెంబరు 2
☛ వదంతి (వెబ్‌సిరీస్‌) డిసెంబరు 2

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -