Oukitel WP19: ఆ కొత్త ఫోన్‌ బ్యాటరీ బ్యాకప్‌ ఎంతో తెలుసా?

Oukitel WP19: మార్కెట్లో వివిధ రకాల ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి. వారం వారంలో కొత్తకొత్త ఫోన్‌లను కంపెనీలు పోటీపడి మార్కెట్లలోకి వదులుతున్నారు. ఆయా కంపెనీలు వినియోగదారులను ఆకర్షించేందుకు కొత్తకొత్త ఫీచర్లను పెట్టి ఫోన్‌లను తయారు చేస్తున్నారు. ఎవరైనా కొత్త ఫోన్‌ కొనాలకున్నప్పుడు ఫస్ట్‌ ఆలోచించే రెండే రెండు ప్రశ్నలు.. మొదటగా ఫోన్‌ ప్రాసెసర్, బ్యాటరీ, కెమెరాలను పరిగణలోకి తీసుకొని ఫోన్లను కొనుగోలు చేస్తున్నారు. ఒకప్పుడు వివిధ శుభాకార్యాలకు వీడియో కెమెరాల్లో తీసేవారు. ప్రస్తుతం అలాంటి కార్యక్రమాలు కూడా సెల్‌ఫోన్లలో ఘాట్‌ చేస్తున్నారంటే ఇప్పుడొస్తున్న ఫోన్‌ కెపాసిటీ ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు.

అయితే.. చైనాకు చెందిన ఓ ప్రముఖ టెక్‌ కంపెనీ ఔకిటెల్, గ్లోబల్‌గా ఓ కొత్త స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లో విడుదల చేసింది. ‘ఔకిటెల్‌ డబ్ల్యూపీ–19’ పేరుతో ప్రపంచంలోనే అత్యంత సామర్థ్యం కలిగిన 21000ఎంఏహెచ్‌ బ్యాటరీ స్మార్ట్‌ఫోన్‌ ఇది. అంతేకాక నాణ్యత కూడా దానికి పోటీ పడేలా ఉంది. మీడియాటెక్‌ హీలియో జీ–95 ప్రాసెసర్, 64 మెగా పిక్సల్‌ ప్రధాన కెమెరా, 20 మెగా పిక్సల్‌ సోనీ ఐఎంఎక్స్‌350 నైట్‌ విజన్‌ కెమెరా తదితర లేటెస్ట్‌ ఫీచర్స్‌ను అప్‌డెట్‌ చేసి విడుదల చేసింది.

అయితే ఈ ఫోన్‌ విడుదల సందర్భంగా ప్రత్యేకమైన డిస్కౌంట్‌ను కూడా ఆ కంపెనీ ప్రకటించింది. ఔకిటెల్‌ డబ్ల్యూపీ–19 ఒరిజినల్‌ ధర రూ. రూ.82,510 అయితే.. 71 శాతం తగ్గించి కేవలం రూ.23,927కే కస్టమర్లకు ఇవ్వనున్నారు. ఈ ఆఫర్‌ కూడా కొన్ని రోజులు మాత్రమే పెట్టింది. ఈ ఫోన్‌ కొనాలనుకునే వారు ‘అలీ ఎక్స్‌ప్రెస్‌’దారా కొనుగోలు చేయొచ్చు. కఠినమైన అవుట్‌డోర్‌ పరిస్థితులను తట్టుకునేలా దీన్ని తయారు చేశారు. ఈ ఫోన్‌ యొక్క హైలైట్‌ ఫీచర్‌ బ్యాటరీ సామర్థ్యం 21000ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీ ఉంటుంది. విద్యుత్‌ లేని ప్రాంతంలో కూడా ఒక వారం పాటు వాడొచ్చు. ఒక్కసారి ఫుల్‌ ఛార్జ్‌ చేస్తే వారం రోజుల బ్యాకప్‌ ఇస్తోంది. అంతేకాక 33వాట్‌ ఫాస్ట్‌ ఛార్జర్‌కు చేయనుంది. 80 శాతం చార్జింగ్‌ అవ్వడానికి మినిమం 3 గంటలు పడుతోంది. ఇదేకాక రివర్స్‌ చార్జింగ్‌ ఫంక్షన్‌తో, ఫోన్‌ను సులభంగా మినీ పవర్‌ బ్యాంక్‌గా మార్చుకోవచ్చు.

ప్రత్యేకతలు..

1. 21000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీ.

2. 6.79 అంగుళాల ఫుల్‌ హెచ్డీ డిస్‌ప్లే విత్‌ 90హెచ్‌జడ్‌ రిఫ్రెష్‌ రేట్‌.

3. మీడియాటెక్‌ హీలియో జీ95 ప్రాసెసర్‌.

4. 8జీబీ +256జీబీ స్టోరేజ్, ట్రిపుల్‌ కెమెరా .

5. 64 మెగా పిక్సల్‌ శాంసంగ్‌ ప్రధాన కెమెరా. 20 మెగా పిక్సల్‌ సోనీ ఐఎంఎక్స్‌350 నైట్‌ విజన్‌ కెమెరా, + 3ఎంపీ కెమెరా.

6. సెల్ఫీలు, వీడియో కాలింగ్‌కు ఫ్రంట్‌లో 16 మెగాపిక్సెల్‌ కెమెరా.

7.బ్యాక్‌సైడ్‌ 4 ఇన్‌ఫ్రారెడ్‌ రేడియేషన్‌ ఎమిటర్స్‌.

Related Articles

ట్రేండింగ్

News Arena India: మళ్లీ జగనే సీఎం.. మరో సంచలన సర్వే.. న్యూస్ ఎరేనా సర్వేలో వైసీపీ సీట్ల లెక్క ఇదే!

News Arena India: ఏపీలో అధికార వైసీపీ ప్రచారంలో దూసుకుపోతుంది. ఆ పార్టీ అధినేత జగన్ తనదైన సిద్దం సభలను మొదట నిర్వహించి పార్టీ శ్రేణులు, కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. ఆ తర్వాత...
- Advertisement -
- Advertisement -