Rajasthan: నవ వధువుకు కన్యత్వ పరీక్ష.. ఎక్కడో తెలుసా?

Rajasthan: నేటి సమాజంలో కొందరు మానవత్వం లేకుండా ఎంతకైన తెగించి ఎదుటి వారిని కించపరుస్తూ వారి మనోభావాలు దెబ్బతీస్తున్నారు. కొత్తగా పెళ్లయి ఎన్నో ఆశలతో అత్తారింటిలో అడుగు పెట్టిన ఓ నవ వధువును అనుమానిస్తూ బజారుకిడ్చారు అత్తామామలు. కన్యత్వ పరీక్షలో వధువు విఫలం కావడంతో భర్త, అత్తామామలు ఈ దారుణానికి ఒడిగట్టారు. పంచాయితీ పెట్టి ఆమెకు రూ.10 లక్షల జరిమానా విధించారు. అందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి..

రాజస్థాన్‌లోని భిల్వారా జిల్లాలో మే 11వ తేదీన బాధితురాలు (24)కు బాగోర్‌కు చెందిన ఓ వ్యక్తితో రెండు కుటుంబాల ఇష్టపూర్వకంగా ఘనంగా వివాహం జరిగింది. అయితే.. వారి సంప్రదాయం ప్రకారం‘కుక్డి’ విధానంలో నిర్వహించిన కన్యత్వ పరీక్షలో నవ వధువు విఫలమైంది. దీంతో ఖంగుతిన్న అత్తింటివారు వధువును నిలదీయగా ఆమె చెప్పిన విషయాలు విన్న వరుడు షాక్‌కు గురయ్యాడు. పెళ్లికి ముందే తన ఇంటి వద్ద ఉండే ఓ వ్యక్తి ఆమెపై లైంగిక దాడికి పాల్పడినట్టు వధువు చెప్పుకొచ్చింది. దీంతో ఆగ్రహానికి గురైన భర్తతో పాటు అత్తామామలు ఆమెను అక్కడిక్కడే చితకబాదారు. అంతటితో ఊరుకోకుండా గ్రామ పెద్దలను పిలిపించి వారి సమక్షంలో పంచాయితీ పెట్టించారు.

పంచాయితీలో ఇరువురి వాదనలు విన్న గ్రామ పెద్దలు వధువు, ఆమె కుటుంబానికి రూ.10 లక్షల జరిమానా విధించారు. ఆ డబ్బులు చెల్లించనందుకు వధువుతో పాటు ఆమె కుటుంబాన్ని అత్తింటి వారు వేధించారు. అనంతరం ఆమెను పుట్టింటికి పంపించారు. పలువురి సలహా మేరకు వధువు కుటుంబ సభ్యులు స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో జరిగిన ఘటనపై ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు భర్తతో పాటు, ఆమె అత్తా మామలపై కేసు నమోదు చేశారు. ఈ వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో నెటిజన్లు తమదైన ౖశైలిలో కామెంట్లు చేస్తున్నారు. కొందరు వధువుకు మద్దతుగా మాట్లాడగా.. మరికొందరు వధువు అత్తామామల వైపు మద్దతు తెలుపుతూ కామెంట్లు చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Rayalaseema: చంద్రబాబు ఎంట్రీతో సీమలో పరిస్థితి మారుతోందా.. ఆ స్థానాల్లో టీడీపీనే గెలుస్తోందా?

Rayalaseema: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజాగళం అని పేరిట యాత్రను ప్రారంభించిన సంగతి మనకు తెలిసిందే. నిన్న పలమనేరులో ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమం ఎంతో విజయవంతం అయింది ఇకపోతే ఈ...
- Advertisement -
- Advertisement -