Panth: పంత్.. 66 మ్యాచులు వృధా చేశాడని మండిపడుతున్న నెటిజన్లు

Panth: టీమిండియాలో ప్రతి ఆటగాడు ఓ మిస్సైల్ లాగా దూసుకెళితే.. ఇక టీంకు ఎదురే ఉండదు అని అందరికీ తెలుసు. కానీ భారీ అంచానాలు పెట్టుకున్న ఆటగాళ్లు తుస్సుమనిపించడం.. ఆ తర్వాత ఒకరో ఇద్దరో అలా నెట్టుకు వచ్చి చివరకు చేతులు ఎత్తేయడం టీమిండియాకు మామూలైపోయింది. ఇలా భారీ అంచనాలతో వచ్చి తుస్సుమనిపించే క్రికెటర్ల జాబితా చాలా పెద్దదే.

 

భారీ అంచనాలతో దిగి పెద్దగా ఆకట్టుకోలేకపోతున్న ఆటగాళ్ల జాబితాలో రిషబ్ పంత్ ఒకడిగా నిలుస్తున్నాడు. ఎం.ఎస్ ధోని స్థానంలో ఆయన శిష్యుడిగా అదరగొట్టేస్తాడని అందరూ అనుకున్న పంత్ మాత్రం.. పేలవమైన ఆటతీరుతో ఉసూరుమనిపిస్తున్నాడు. వికెట్ కీపర్ గానే కాదు.. కెప్టెన్ గా కూడా ధోనీ అదరగొట్టేశాడు. అతడు స్టంప్స్ వెనక ఉంటే ఓ అభయం, బ్యాటింగ్ చేస్తున్నాడంటే ఓ భరోసా ఉండేది.

 

ధోని రిటైర్మెంట్ తర్వాత పూర్తిస్థాయిలో మ్యాచుల్లో అవకాశాలు దక్కించుకుంటున్న రిషబ్ పంత్.. ఏ రేంజ్ లో ఆడుతున్నాడనే విషయం ఆయన లెక్కలు చేస్తేనే అర్థమవుతోంది. రిషబ్ పంత్ న్యూజిలాండ్ తో జరిగిన టీ20 వరకు మొత్తం 66 మ్యాచులు ఆడాడే. అన్ని మ్యాచుల్లో కలిపి అతడు చేసిన స్కోర్ కేవలం 987 పరుగులు మాత్రమే. అతడి యావరేజ్ స్కోర్ 22.43గా ఉంది.

 

టెస్టుల్లో కాస్త పరవాలేదు అనిపించుకుంటున్న పంత్.. టీ20ల్లో మాత్రం తుస్సుమంటున్నాడు. కనీసం మ్యాచుకు 15 పరుగులు కూడా తీయకపోవడం ఏంటి అని నెటిజన్లు మండిపడుతున్నారు. ఇప్పటి వరకు 66 మ్యాచులను పంత్ వృధా చేశాడని అంటున్న నెటిజన్లు.. అతడి స్థానంలో కొత్త వారికి అవకాశం ఇవ్వాలని అంటున్నారు. అతడి స్థానంలో సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ లకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. మరి పంత్ ఆటతీరు ఇలానే ఉంటే మాత్రం రాబోయే రోజుల్లో అతడి పేరు జట్టులో ఉండటం కష్టమనే అనిపిస్తోంది.

Related Articles

ట్రేండింగ్

ఏపీలో ఆడుదాం ఆంధ్ర పోటీలకు రిజిస్ట్రేషన్లు ప్రారంభం.. రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలంటే?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ ఎప్పటికప్పుడు సంచలన నిర్ణయాలు తీసుకుంటూ విద్యార్థులు, యువతకు మేలు చేస్తున్న సంగతి తెలిసిందే. జగన్ సర్కార్ ఆడుదాం ఆంధ్ర పేరుతో క్రీడా పోటీలను నిర్వహిస్తుండగా...
- Advertisement -
- Advertisement -