Love Affair: అమ్మాయితో లవ్‌.. తల్లితో అక్రమ సంబంధం.. చివరకు హత్య!

Love Affair: కొందరు అక్రమ సంబంధాల జోలికి వెళ్లి ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. భర్తకు తెలియకుండా భార్య, భార్యకు తెలియకుండా భర్త ఎవరికి వారే అక్రమ సంబంధాలు కొనసాగిస్తున్నారు. కొన్ని రోజుల తర్వాత అవి బయటపడటంతో గొడవలు, దాడులు కొన్ని సార్లు ప్రాణాలు సైతం కోల్పోతున్నారు. ఓ యువకుడు ఓ అమ్మాయితో ఉంటూ ఆమెకు తెలియకుండా ఆమె తల్లితోనూ అక్రమ సంబం«ధం పెట్టుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత బయటపడటంతో తల్లికూతురు చేతుల్లో ప్రాణాలు కోల్పోయాడు. అందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

బెంగాల్లోని దక్షిణ 24 పరగణాల జిల్లాలోని మగ్రాహలేకు చెందిన అయాన్‌ మోండల్‌ (21) క్యాబ్‌ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. అయితే, అదే ప్రాంతానికి చెందిన ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. అదే సమయంలో యువతికి తెలియకుండా ఆమె తల్లితో కూడా ఎఫైర్‌ నడుపుతున్నాడు. కొన్ని రోజుల వరకు ఈ తతంగం కొనసాగింది. విజయ దశమి రోజున సాయంత్రం తన ప్రేయసిని కలిసేందుకు ప్రయత్నించాడు. ముందుగా ఆమెకు పలుసార్లు ఫోన్‌ చేయగా యువతి కట్‌ చేసింది. దాంతో కోపోద్రిక్తుడైన యువకుడు నేరుగా ఆమె ఇంటికి వెళ్లాడు.

మద్యం మత్తులో ఉన్న ఆయాస్‌ మోడల్‌ ఇంట్లో ఉన్న యువతి తల్లితో ఘర్షణకు దిగడంతో పాటు ఆమెపై దాడి చేశాడు. అక్కడే ఉన్న అతని ప్రియురాలు, ఆమె సోదరుడు, తండ్రి ముగ్గురూ కలిసి అయాన్‌ మోండలతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన యువతి సోదరుడు అయాన్‌ మోడల్‌ తలపై ఆయుధంతో కొట్టడంతో తీవ్రంగా గాయపడిన అయాన్‌ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. అయాన్‌ హత్య బయటకు పొక్కుండా ఉండేందుకు అతని మృతదేహాన్ని రహస్యంగా మగ్రాహత్‌ ప్రాంతంలో నిర్మానుష్య ప్రాంతంలోకి తీసుకెళ్లి పడేశారు.

అయితే, పండుగ తెల్లారి అయాన్‌ మోడల్‌ కనిపించకపోవడంతో అతని కుటుంబ సభ్యులు హరిదేవ్‌ పూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అయాన్‌ కోసం గాలిస్తున్న క్రమంలో ఆయన మృతదేహం లభ్యమైంది. మృతుడి ఫోన్‌ డేటా ఆధారంగా అయాన్‌ మెండల్‌ ను హతమార్చిన అతని ప్రియురాలు, ఆమె తల్లి, తండ్రి, సోదరుడు, మరో ఇద్దరు యువకులు సహా మొత్తం ఆరుగురిని రిమాండ్‌కు తరలించారు.

Related Articles

ట్రేండింగ్

ఒకరిద్దరు లుచ్చాగాళ్ళ ఫోన్లు టాప్ చేసి ఉండొచ్చు.. కేటీఆర్ కామెంట్లతో నిజాలు తెలిసిపోయాయిగా!

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వివాదంలో వెంట్రుక లాగితే డొంక కలుగుతోంది. ప్రతిరోజు పేరు తెరపైకి కొత్త పేర్లు వస్తున్నాయి. గురువారం మరో ఇద్దరు పోలీసులను విచారణ బృందం అదుపులోకి తీసుకుంది. వారిలో టాస్క్...
- Advertisement -
- Advertisement -