Paruchuri Gopala Krishna: మహేష్ బాబును అలా చూస్తానని అనుకోలేదు.. పరుచూరి షాకింగ్ కామెంట్స్!

Paruchuri Gopala Krishna: టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా చిత్ర పరిశ్రమ మొత్తం తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తుంది. కృష్ణంరాజు గారి మరణ వార్త మర్చిపోకముందే టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ గారు సతీమణి ఇందిరా దేవి మరణ వార్త అందరిని కలిచి వేసింది.ఈ విధంగా ఇందిరాదేవి మరణించడంతో టాలీవుడ్ చిత్ర పరిశ్రమ మొత్తం ఆమెకు నివాళులు అర్పించారు. ఇకపోతే తాజాగా ఇందిరా దేవి గారి సంస్కరణ సభ నిర్వహించగా పెద్ద ఎత్తున ఈ సంస్కరణ సభలో టాలీవుడ్ ప్రముఖులు పాల్గొన్నారు.

ఈ క్రమంలోనే టాలీవుడ్ చిత్ర పరిశ్రమ నుంచి పెద్ద ఎత్తున పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఇందిరా దేవికి నివాళులు అర్పించారు. ఈ క్రమంలోనే పరుచూరి గోపాలకృష్ణ సైతం కృష్ణ ఇంటికి వెళ్లి ఇందిరా దేవికి నివాళులు అర్పించారు. ఈ క్రమంలోనే ఈ విషయంపై పరుచూరి మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. కృష్ణ గారి కుటుంబంతో తనకు కొన్ని సంవత్సరాల నుంచి ఎంతో మంచి అనుబంధం ఉందని తెలిపారు.

కృష్ణ గారిసతీమణి ఇందిరా దేవి గారు సాక్షాత్తు మహాలక్ష్మి ఆమె ఎప్పుడు నవ్వుతూ ప్రతి ఒక్కరిని పలకరిస్తూ ఉంటారు. ఈమె ఎప్పుడు ఎక్కువగా మాట్లాడరు. ఇలాంటి ఓ గొప్ప తల్లి మరణించారు అనగానే చాలా బాధగా అనిపించిందని పరుచూరి గోపాలకృష్ణ ఇందిరాదేవి గురించి ఎంతో గొప్పగా తెలియజేశారు. ఇకపోతే ఈ కార్యక్రమంలో కృష్ణ గారు పక్కనే ఉన్నారు. ఆయన ఎంతో నిబ్బరంగా ఉన్నారు. ఆయనని చూడగానే నా గుండె తరుక్కుమనిందని ఈ సందర్భంగా పరుచూరి వెల్లడించారు.

ఇకపోతే మహేష్ బాబు ఎప్పుడు చిరునవ్వుతో కనిపించే ఆయన తల్లి మరణంతో ఎంతో కృంగిపోయారని ఆయనని ఎప్పుడూ అలా చూస్తాను అనుకోలేదు అంటూ ఈ సందర్భంగా పరుచూరి మహేష్ బాబు గురించి చేసిన ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.ఇకపోతే తల్లి మరణంతో మహేష్ బాబు తన సినిమా షూటింగుకు విరామం ప్రకటించారు. త్వరలోనే త్రివిక్రమ్ సినిమా షూటింగులో పాల్గొనబోతున్నట్టు తెలుస్తుంది.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -